HIT 3 Censor Report: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్

నాని నటించిన "హిట్ 3" సినిమా సెన్సార్ బోర్డు నుండి 18+ సర్టిఫికెట్‌ పొందింది. ఇది పిల్లలు, సున్నిత మనస్కులు చూడలేని యాక్షన్, రక్తపాతం, బూతులు ఉన్న చిత్రం కాగా, మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.

New Update
HIT 3 Sencor Report

HIT 3 Censor Report

HIT 3 Censor Report: నానికి(Nani) టాలీవుడ్‌లో యూత్ ఆడియన్స్ నుండి ఫ్యామిలీస్ వరకూ అందరి నచ్చే హీరోగా మంచి పేరుంది. అయితే, కొంత కాలంగా అన్ని యాక్షన్ మూవీస్ చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా, నాని నటించిన 'హిట్ 3' మూవీకి సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ నుండి 18+ సర్టిఫికెట్ పొందింది. అంటే పిల్లలు, సున్నిత మనస్కులు ఈ చిత్రాన్ని చూడలేరు. 

Also Read:"క్రిష్ 4" లో ప్రియాంక చోప్రా ఫిక్స్..

18+ సర్టిఫికెట్..

గతంలోనే నాని ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు, ఈ మూవీ అవుట్ అండ్ ఔట్  వియోలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుంది, పిల్లలు ఈ మూవీని చూడకూడదని అని చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో కూడా అదే జరిగింది. "హిట్ 3" టీజర్ లో కూడా రక్తపాతంతో ఉండగా, సినిమా కంటెంట్ లో కూడా అలాంటి దృశ్యాలు ఉన్నాయని, సెన్సార్ వాటిని బ్లర్ చేయమని సూచించిందట. ఈ సినిమా పైన అంచనాలు భారీగా ఉన్నప్పటికీ, కొన్ని సన్నివేశాల్లోని బూతులు, రక్తపాతం కారణంగా సెన్సార్ బోర్డ్ నుండి 18+ సర్టిఫికెట్ పొందింది. 

Also Read:మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..

ఈ చిత్రంలో నాని పోలీస్ పాత్రలో నటిస్తుండగా, శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్ల లో భాగంగా ట్రైలర్ సోమవారం ఉదయం విడుదల చేసారు.

Also Read:ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Also Read:భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

Advertisment
తాజా కథనాలు