BIG BREAKING : కవిత కాంగ్రెస్‌లోకి వస్తానంటున్నారు.. కానీ నేనే వద్దన్నా :  మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారంటూసంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
Mahesh Kumar Goud

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారంటూసంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, కవిత పార్టీ మార్పు అంశంపై కీలక విషయాలు వెల్లడించారు.కవిత మా పార్టీలో చేరుతానని అంటున్నారు. ఆమె వైపు నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

సమర్థవంతమైన నాయకులు ఉన్నారని

అయితే ఆమె చేరికను తానే వద్దంటున్నానని , కవితను చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఎంతోమంది శక్తివంతులైన, సమర్థవంతమైన నాయకులు ఉన్నారని.. కవిత కంటే మెరుగైన నాయకత్వం తమ వద్ద ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని చేర్చుకుని పార్టీ ప్రతిష్టను దెబ్బతీసుకోమన్నారు.  అయితే, దీనిపై కవిత నుంచి ఇంకా ఎలాంటి రియాక్షన్ లేదు. 

Advertisment
తాజా కథనాలు