KTR: వాడి నియోజకవర్గంలో మాకేం పని.. రేవంత్ పై కేటీఆర్ సంచలన కామెంట్స్!

లగచర్ల దాడి ఘటనపై కేటీఆర్ మరోసారి స్పందించారు. కొండంగల్ ఘటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వం సమస్యను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. సీఎం నియోజకవర్గంలో మేమందుకు వేలు పెడతామన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
rev ktr

వికరాబాద్‌ జిల్లాలోని సీఎం రేవంత్ నియోజకవర్గమైన కొడంగల్‌లోని లగచర్లలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్, అధికారులపై గ్రామస్థులు దాడి చేయడం చర్చనీయమవుతోంది. ఈ దాడి వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. మరోవైపు ఈ ఆరోపణలను బీఆర్‌ఎస్ ఖండిస్తోంది. తాజాగా ఈ ఘటనపై  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. కొండంగల్ ఘటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వం సమస్యను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.    

Also Read: లగచర్ల భూములు ముట్టుకుంటే ఊరుకోం.. రేవంత్ కు మావోయిస్టుల సంచలన లేఖ!

KTR - Revanth Reddy

'' ఈ దాడి ఘటనపై మావోయిస్టులు కూడా స్పందించారు. కానీ హరగోపాల్, కోదండరాం కనీసం మాట్లాడడం లేదు. సురేష్ మా పార్టీ కార్యకర్త, అతనికి 7 ఎకరాల భూమి ఉంది. పక్కా చెప్తున్నా 4 సంవత్సరాల తర్వాత మళ్లీ మేమే వస్తాం. నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టు బోగస్. బండి సంజయ్ రేవంత్ రెడ్డికి సహాయ మంత్రి.  మహిళ ఛాతీపై కాలు పెట్టి తొక్కి భర్తను అరెస్టు చేశారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేసే ప్రసక్తే లేదు. నేషనల్ విమెన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం వరకు కూడా తీసుకెళ్తాం. నన్ను లోపల వేస్తే ఎన్ని రోజులు వేస్తాడు. కొన్ని రోజుల తరువాత బయటికి వస్తా కదా. బయటకి వచ్చి మళ్ళీ ఇంకా గట్టిగా మాట్లాడుతా. నన్ను లోపలేస్తే మా పార్టీ ప్రజల కోసం ప్రజల కోసం కొట్లాడుతుంది. 

Also Read :  ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ కేటుగాళ్ల ఉచ్చు.. రూ.46 లక్షలు గోవిందా!

వెల్దండలో రేవంత్ భూములు ఉన్నాయి. రేవంత్ అన్నదమ్ములు ఆ ఏరియాలో ఇంకా భూములు కొంటున్నారు. అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. వాడు ముఖ్యమంత్రి, వాని నియోజకవర్గంలో మేము వేలు పెడుతమా . పైనుండి కాంగ్రెస్ పెద్దలు రేవంత్‌ని డబ్బులు అడుగుతున్నారు. అందుకే ఏదో ఒకటి చేసి పైకి డబ్బులు పంపాలని చూస్తున్నాడు. రేవంత్ ఈ డ్రామా బంద్ చేయ్. గతంలో నేను ఈడీ, మోడీ ఏం చేసుకుంటారు చేసుకోమ్మని చెప్పాను. నేను డబ్బులు తీసుకోలేదు, డ్రగ్స్ తీసుకోలేదు, ఏ తప్పు కూడా చేయలేదని'' కేటీఆర్ అన్నారు. 

Also Read: అరెస్ట్ కాబోతున్నా.. పార్టీ నేతల వద్ద కేటీఆర్ ఎమోషనల్!

ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి కోసం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్‌ రెడ్డి పోటీ పడుతున్నారని తెలిపారు. తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయని పేర్కొన్నారు. భూమితో రైతులకు ఒక ఎమోషన్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇదిలాఉండగా.. లగచర్ల దాడి కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నరేందర్‌ రెడ్డి ఇప్పటికే  హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. సోమవారం దీనిపై విచారణ జరగనుంది. 

Also Read :  నడిరోడ్డుపై దారుణం.. తల్లీ కొడుకును నరికి చంపిన యువకుడు!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు