Koneru Konappa :  కోనేరు కోనప్ప యూటర్న్‌...కేసీఆర్‌ నా దేవుడు అంటూ..

కాంగ్రెస్ వర్గ పోరు తట్టుకోలేక కొందరు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాను కానీ కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం వెళ్లనని చెప్పారు.

New Update
Koneru Konappa

Koneru Konappa

తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ పోరు ముదురుతోంది. సగానికి పైగా నియోజకవర్గాల్లో పార్టీ రెండు, మూడు వర్గాలుగా విడిపోయింది. పాత, కొత్త నేతలతో ఎక్కడ సమావేశం జరిగినా గొడవలే జరుగుతున్నాయి. ఎంపీలను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలను ఎంపీలు ఖాతరు చేయడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో మంత్రులను కూడా ఎమ్మెల్యేలు దేఖడం లేదు. ఎవరికి వారే యుమనా తీరే అన్నట్లుగా లీడర్లు ఉండటంతో.. కాంగ్రెస్ కేడర్‌ ఆగమాగమవుతోంది.

ఇది కూడా చూడండి:యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

Koneru Konappa About KCR

కాంగ్రెస్ వర్గ పోరు తట్టుకోలేక కొందరు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాను కానీ కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం వెళ్లనని చెప్పారు. కేసీఆర్ దేవుడు.. ఆయనకు పాదాభివందనాలని కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే చెప్పానని తెలిపారు. తనను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని పార్టీలో తీసుకునేటప్పుడు చెప్పలేదనే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చానని కోనేరు కోనప్ప చెప్పారు. రాజకీయంగా బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. తనను ఓడించిన వ్యక్తిని పార్టీలోకి తీసుకున్నందుకే.. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చానన్నారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. బీఆర్ఎస్ పార్టీ తనకు ఎలాంటి అన్యాయం చేయలేదన్నారు.రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానన్న కోనేరు కోనప్ప తెలంగాణను అభివృద్ధి చెసింది కేసీఆర్‌ అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చూడండి: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప కొంతకాలంగా పార్టీ నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఘోరాతిఘోరంగా ఉన్నాయని తన అసంతృప్తిని మరోసారి వెళ్లగక్కారు. తాజాగా ఓ కార్యక్రమంలో తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం హామీ ఇచ్చినా కౌటాల బ్రిడ్జికి నిధులు మంజూరు కాలేదని బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. పదేళ్లలో రైతులకు ఏ కష్టం లేకుండా చూసుకున్నా, కానీ ఇప్పుడు పట్టించుకునే వారేలేరని ఆవేదన వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక అప్పటి పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో చేరాను. తాను చేరిన తర్వాత గతంలో కంటే ఆ పార్టీకి ఓట్లు భారీగా పెంచగలిగాం. కానీ సిర్పూర్ నియోజకవర్గంపై గానీ, నామీద, నా కార్యకర్తల మీద ప్రేమ లేకుండా కొంత మంది కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపులు పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. 

ఇది కూడా చూడండి: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

ఇది కూడా చూడండి:SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్

today telugu news | telugu news online | Breaking Telugu News | telugu-news | kagaznagar | koneru-konappa

Advertisment
తాజా కథనాలు