కలెక్టర్ వస్తే తరిమికొడదాం.. పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో విడుదల! TG: పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రజలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఫార్మా కంపెనీ కోసం సీఎం వచ్చినా.. కలెక్టర్ వచ్చినా తరిమికొడదామని.. కేటీఆర్ మీకు అండగా ఉంటారని ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 14 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Patnam Narender Reddy: లగిచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో సహా ఇతర అధికారులపై జరిగిన దాడి కేసులో ఇప్పటికే అరెస్టైన కొండంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాడి తరువాత పట్నం నరేందర్ రెడ్డి.. కొందరు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో సమావేశం అయిన వీడియో ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ వీడియో పట్నం నరేందర్ రెడ్డిని మరింత ఇరకాటంలోకి నెట్టింది. ఇది కూడా చూడండి: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా? మొన్నటిది ట్రైలరే... వీడియోలో పట్నం నరేందర్ రెడ్డి ఇలా మాట్లాడారు.. మొన్న జరిగింది ట్రైలరే.. రాబోయే రోజుల్లో డబుల్, త్రిబుల్ దాడులు ఉంటాయని అన్నారు. ఫార్మా కంపెనీ పేరిట వస్తే తరిమికొడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు వచ్చినా, కలెక్టర్ వచ్చినా తరిమి కొడతామని అన్నారు. మీకు నేను, కేటీఆర్, హరీష్‌రావు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అందరూ ధైర్యంగా ఉండాలని కేటీఆర్ అన్నారన్న.. మళ్లో సారి వస్తే కేటీఆర్ రంగంలోకి దిగుతారని చెప్పారు. ఎవరొస్తరో రానీయండి చూసుకుందామని.. ఫార్మాను రద్దు చేసే వరకు మీ వెంటనే ఉంటామని ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వీడియోతో పాటు పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ చెప్పిన విషయాలు ఆధారం చేసుకొని పోలీసులు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ అరెస్ట్ పై సస్పెన్స్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇది కూడా చూడండి: Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ కేటీఆర్ ను ఇరికించిన నరేందర్ రెడ్డి... కలెక్టర్ పై జరిగిన దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డినియూ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. నరేందర్ రెడ్డికి 14 రోజుల కస్టడీ విధించింది కోర్టు. ప్రస్తుతం ఆయనను చర్లపల్లి జైలులో ఉంచారు. అయితే నిన్న పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కేటీఆర్ ను ఇరుకున పెట్టె స్టేట్మెంట్స్ ను నరేందర్ రెడ్డి ఇచ్చారు. కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ దాడికి ప్రోత్సహించినట్లు నరేందర్ పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇది కూడా చూడండి: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టినట్లేనా! ఇది కూడా చూడండి: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం #telangana #vikarabad #Vikarabad farmers attack #brs #Patnam Narender Reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి