Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ

ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌‌ను ఈ ఏడాదికిగాను బ్రిటన్ రచయిత్రి సమంతా హార్వేకి అందజేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఆరుగురు వ్యోమగాముల జీవితంలో విషయాలను ఆర్బిటాల్ అనే నవల రాసినందుకు ఈ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. ఈ అవార్డు గెలుచుకున్న మొదటి మహిళ ఈమెనే.

New Update
Samantha Harvey

Booker Prize:

నవలలు రాసిన వారికి ప్రతీ ఏడాది ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌‌ను ఇస్తారు. అయితే ఈ ఏడాదికి గాను బ్రిటన్‌ రచయిత్రి సమంతా హార్వే ఈ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. ఆర్బిటల్‌ అనే నవత రాసినందుకు సమంతాకి ఈ బహుమతి అందజేశారు.ఈ బహుమతి కింద ఆమెకు 50 వేల పౌండర్లు అనగా రూ.53.65 లక్షలు అందజేస్తారు. బ్రిటన్‌లో ఎక్కువగా సేల్ అయిన నవల ఇదే. మొత్తం 136 పేజీలతో ఉన్న ఈ నవలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఆరుగురు వ్యోమగాముల జీవితంలో జరిగే విషయాల గురించి వివరించారు. భూమిపై 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాల గురించి ఈ నవలలో వివరంగా ఉంటుంది. అయితే ఈ బుకర్ ప్రైజ్ అందుకున్న మొదటి మహిళ సమంతా హార్వే.

Also Read: Cricket: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఆరుగురు వ్యోమగాములు 17000 మైళ్ల వేగంతో ఒకే రోజులో 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతారు. కేవలం 24 గంటల్లో వారు హిమానీ నదాలు, ఎడారులు, మహా సముద్రాలు ఇలా అన్నింటిని కూడా చేస్తారు. వారు అక్కడ ఎలా జీవించారనే దానిపై ఆమె వివరంగా ఆ పుస్తకంలో రాశారు. అంతరిక్షంలో జరిగిన విషయాలపై మొదటిసారిగా బుకర్ ప్రైజ్ గెలిచిన నవల కూడా ఇదే. 

Also Read: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?

Also Read: USA: విజయం తర్వాత మొదటిసారి వైట్ హౌస్‌కు ట్రంప్..బైడెన్‌తో భేటీ

Also Read: Movies: సూర్య కెరీర్‌‌లోనే అతి పెద్ద సినిమాగా కంగువ..విశేషాలివే..

Advertisment
తాజా కథనాలు