దారుణం.. 65ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం ఆపై హత్య

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలం రామన్నగూడెం గ్రామంలో వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి దుండగులు హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు 65ఏళ్ల ఒంటరి వృద్ధాప్య మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశారు.

New Update
1452

మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 65ఏళ్ల వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి దుండగులు హత్య చేశారు. నెల్లికుదుర్ మండలం రామన్నగూడెం గ్రామంలో ఈ షాకింగ్ ఘనట చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు 65ఏళ్ల ఒంటరి వృద్ధాప్య మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. 

మృతురాలి స్వగ్రామం జిల్లాలోని కురవి మండలం తిర్లపాలెం గ్రామం. బాధితురాలికి ముగ్గురు కుమార్తెలు.. వారి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. 2 వ కుమార్తె వద్ద ఆమె జీవనం కొనసాగిస్తోంది. 2వ కుమార్తె కుటుంబం సైతం జీవనోపాధికై హైదరాబాద్ వెళ్లింది. దీంతో ఒంటరిగానే ఉంటున్న వృద్ధ మహిళపై దుండగులు కన్నేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమాతులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు