Telangana: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై కీలక అప్‌డేట్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. పంచాయతీల్లో ఓటరు జాబితాను మరోసారి సవరణ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయం తీసుకుంది.

New Update
Local body elections in telangana

Local body elections in telangana


తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. పంచాయతీల్లో ఓటరు జాబితాను మరోసారి సవరణ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయం తీసుకుంది. 20వ తేదీన ఓటర్ల దరఖాస్తు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ చేపట్టాలని ఈసీ ఉత్తర్వుల్లో తెలిపింది. 21న  అభ్యంతరాల పరిష్కారం, 23న తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని పేర్కొంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని.. జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

Also Read: విద్యార్థులు, ఉద్యోగులకు ఫ్రీ AI కోర్స్‌.. గవర్నమెంట్ స‌ర్టిఫికెట్‌ కూడా..!

ఇదిలాఉండగా రాష్ట్రంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. వీటి తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ రెండో వారంలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్‌ రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. 

Also Read: RTC డ్రైవర్‌ని చితకబాదిన వ్యక్తి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్

రిజర్వేషన్ల అమలు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి పంచాయతీరాజ్‌శాఖ ఇప్పటికే దీనిపై నివేదిక ఇచ్చింది. మంత్రులు కూడా దీనిపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. అయితే మార్చి 31 లోపు పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తేనే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల అయ్యే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు