Dr. Namrata Srushti case : సృష్టి కేసులో కీలక మలుపు..ఆ బ్యాంక్ అకౌంట్లు సీజ్..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలు ఒకటొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న నమ్రతకు చెందిన పలు బ్యాంక్‌ అకౌంట్లను గుర్తించారు. వీటిలో 8 బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు.

New Update
srusti

Dr. Namrata Srushti case

Dr. Namrata Srushti case :  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలు ఒకటొక్కటిగా బయటికి వస్తున్నాయి. నమ్రత ఆసుపత్రి వెనుక అనేక అక్రమాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే 24 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. కాగా కేసును కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఈ కేసులో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత నుంచి అనేక కీలక విషయాలు రాబట్టారు. డాక్టర్ నమ్రత అక్రమంగా సంపాదించిన సొమ్ముకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడ్డారు.

Also Read:సృష్టి ఫర్టిలిటీ స్కాంలో 80 మంది శిశువుల విక్రయం.. వెలుగులోకి నమ్రత బాగోతాలు

 ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న నమ్రతకు చెందిన పలు బ్యాంక్‌ అకౌంట్లను గుర్తించారు. వీటిలో 8 బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. బ్యాంకు లాకర్లు, ఖాతాల్లో సుమారు రూ.30 కోట్ల విలువైన నగదు, ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ఇంకా ఇతర బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో నగదు దాచినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై 2018 నుంచి ఆమె జరిపిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆయా బ్యాంకులకు గోపాలపురం పోలీసులు లేఖ రాశారు.

Also Read : హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం.. ఆ ప్రాంతాల వారికి హెచ్చరిక

ఇక ప్రధాన అంశమైన పిల్లల విక్రయం విషయంలో నమ్రత కీలక విషయాలు వెల్లడించింది. సరోగసి పేరిట 80 మంది శిశువులను విక్రయించినట్లు ఆమె విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. పేద, గిరిజన కుటుంబాలకు డబ్బుల ఆశ చూపి పిల్లలను తక్కువ ధరకు కొనుగోలు చేశానని.. అలా కొనుగోలు చేసిన పిల్లలను సంతానం లేని దంపతులకు సరోగసి ద్వారా పుట్టారని చెప్పి లక్షల రూపాయలకు అమ్ముకున్నానని దర్యాప్తులో స్పష్టం చేసినట్లు తెలిసింది.

Also Read:కాంగ్రెస్ నేతపై వాటర్‌ బాటిల్‌ విసిరిన BRS ఎమ్మెల్యే

అంతేకాక పిల్లలను అపహరించే గ్యాంగులతో నమ్రతకు సంబంధాలు ఉన్నట్లు తేలింది.మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రప్రదేశ్‌ లకు చెందిన గ్యాంగులతో డాక్టర్ నమ్రతకు సంబంధాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరి నుంచి రూ.3 నుంచి రూ.-5 లక్షలకు పిల్లలను కొనుగోలు చేసి.. సరోగసి పేరుతో దంపతులకు రూ.18 లక్షలు, రూ.25 లక్షలు, రూ.50 లక్షలు ఇలా పెద్ద  మొత్తాలకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక ఆయా ఆసుపత్రుల నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డుల ఆధారంగా 200 మంది దంపతుల రిజిస్ట్రేషన్ వివరాలను పోలీసులు సేకరించారు. వీరి వివరాలను రాబట్టే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు. 

ఇప్పటికే పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమకు పుట్టిన బిడ్డలు తమ రక్తం పంచుకు పుట్టలేదని తెలిసిన చాలామంది తమలో తామే కుమిలిపోతున్నారు. కొంతమంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందకు వస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు తెలిసింది.

Also Read:Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌డెడ్

Advertisment
తాజా కథనాలు