/rtv/media/media_files/2025/08/16/vehicles-fancy-number-2025-08-16-08-31-54.jpg)
Vehicles Fancy Number
Vehicles Fancy Number : కొత్తగా వాహనాలు కొన్నవారెవరైనా తమ వెయికిల్‌కు ఫ్యాన్సీ నంబర్ ఉండాలని కోరుకుంటారు. ఫ్యాన్సీ నెంబరు కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకడుగు వేయరు. తనకు కలిసి వచ్చిన నెంబర్ లేదా జాతకం ప్రకారం నంబర్ తీసుకోవాలని వాహనదారులు అనుకుంటారు.అంతేకాదు నలుగురిలో తన వాహన నంబర్ ప్రత్యేకంగా ఉండాలని కూడా కోరుకుంటారు. అయితే అలాంటివారికి షాక్ ఇస్తూ తెలంగాణ రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యాన్సీ నంబర్ల ఫీజులను రవాణాశాఖ భారీగా పెంచింది. వాటి ధరలు పెంచుతూ రవాణా శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపు ద్వారా రవాణా శాఖకు ప్రతి ఏడాది సుమారు రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ధరల పెంపుతో రవాణా శాఖకు మరింత భారీగా ఆదాయం పెరగనుంది.
Also Read: Swiggy: మళ్ళీ స్విగ్గీ వాయింపు ..భారీగా ప్లాట్ ఫామ్ ఫీజు పెంపు
ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపుకు ఇదివరకు ఐదు శ్లాబులుగా ఉండగా.. ఇప్పుడు అవి ఏడుకు పెరిగాయి. అంటే గతంలో ఫ్యాన్సీ నంబర్లకు రూ.50 వేలు ఉన్న ధర.. ఇప్పుడు ఏకంగా రూ.1.50 లక్షలకు పెరిగింది. అంటే రెండురెట్లు ఫీజు పెరిగిందన్నమాట. అలానే రూ.40 వేలు ఉన్న ఫీజు లక్ష రూపాయలకు, రూ.30 వేలు ఉన్న ఫీజు యాభై వేలకి పెంచుతూ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక రూ.20 వేల ఫీజును రూ.40000కి.. రూ.10 వేల ఫీజును రూ.30000కి.. రూ.5వేల ఫీజును రూ.6000కి పెంచారు. దాంతో ఫ్యాన్సీ నంబర్లపై ఆసక్తి ఉన్నవారికి ఆర్థిక భారం మరింత పెరగనుంది. 1, 9, 6666, 9999, 8055 తదితర సుమారు 100 వరకు ఫ్యాన్సీ నెంబర్లకు ఇకపై ప్రాథమిక ధర పెరిగే అవకాశం ఉంది. దానిపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించిన తర్వాత త్వరలోనే పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ చేస్తామని రవాణా శాఖ వెల్లడించింది.
Also Read: BIG BREAKING: కాల్పుల విరమణ లేదు..ముందుకు సాగని చర్చలు
ఇక అత్యంత ఫ్యాన్సీ నెంబరుగా ఉన్న 9999 నెంబరుకు ఇప్పటి వరకు ప్రాథమిక ధర(వేలం కోసం) రూ. 50 వేలు ఉండేది. ఆ మొత్తం చెల్లించి ఆన్‌లైన్ వేలంలో ఎవరు ఎక్కువ మొత్తానికి పాడుకుంటే వారికే ఆ నెంబరు కేటాయించేవారు. ఇకపై ఈ నెంబరుకు ప్రాథమిక ధర లక్షన్నరగా సవరించారు. 6666 నెంబరుకు ప్రస్తుతం రూ. 30 వేలు ప్రాథమిక ధర ఉండగా దాన్ని రూ. 70 వేలకు పెంచాలని నిర్ణయించారు. అలాగే ఫ్యాన్సీ నెంబర్లకు ఇప్పటివరకు ఐదు స్లాబులు ఉన్నాయి. వాటిలో రూ. 50 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేలుగా ఉండేది. ప్రస్తుతం ఉన్న ఈ ఐదు స్లాబుల్ని ఏడుకు పెంచ నున్నారు. రూ. 1.50 లక్షలు, రూ. లక్ష, రూ. 50 వేలు, రూ. 40 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 6 వేలుగా వాటిని నిర్ణయించారు. నెంబరును బట్టి ప్రాథమికధర వసూలు చేస్తారన్న మాట.
Also Read: TS: పదవులు మీకే..పైసలు మీకే..కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి సంచలన వ్యాఖ్యలు