BIG BREAKING: కాల్పుల విరమణ లేదు..ముందుకు సాగని చర్చలు

అలస్కాలో ట్రంప్, పుతిన్ భేటీ ముగిసింది. కానీ కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం జరగలేదు. గొప్ప పురోగతిని సాధించామని ట్రంప్ చెబుతున్నప్పటికీ యుద్ధం ముగింపు గురించి మాత్రం ఏం చెప్పలేదు. 

New Update
meet

Media Addressing After trump-putin meet

అలస్కాలో దాదాపు రెండున్నర గంటలపాటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయింది. దీనిలో చాలా విషయాలు ఇరువురు అధినేతలూ చర్చించుకున్నారని తెలుస్తోంది. అయితే దేని కోసమైతే మీటింగ్ జరిగిందో అది మాత్రం అది అవ్వలేదని తెలుస్తోంది. కాల్పలు విరమణ గురించి ఏమీ ఒప్పందం జరగలేదని ట్రంప్ తెలిపారు. అయితే చర్చలో గొప్ప పురోగతిని సాధించామని చెప్పారు. అయితే ఇంకా కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని అన్నారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదని ట్రంప్ చెప్పారు. అన్ని విషయాలను పరిష్కరించుకున్నాకనే  అధికారికంగా శాంతి ఒప్పందంపై సంతకం చేస్తారని తెలిపారు. 

Also Read: Swiggy: మళ్ళీ స్విగ్గీ వాయింపు ..భారీగా ప్లాట్ ఫామ్ ఫీజు పెంపు

యుద్ధ విరమణకు తాను నిజాయితీగానే ఉన్నా..

అలాగే శాంతి చర్చల్లో పనులకు ఆటంకం కలిగించవద్దని, ఉక్రెయిన్ ను రెచ్చగొట్టే చర్యలు తీసుకోవద్దని పుతిన్ ను ట్రంప్ హెచ్చరించినట్టు తెలుస్తోంది. అలాగే ఉక్రెయిన్, యూరోపియన్ మిత్ర దేశాలకు కూడా ఇదే వార్నింగ్ ను ఇచ్చారని చెబుతున్నారు. ఆరు, ఏడు గంటల పాటూ జరుగుతాయని అనుకున్న చర్చలు మూడు గంటల్లోపునే ముగిశాయని క్రెమ్లిన్ అధికారులు తెలిపారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్ తో యుద్ధ ముగింపుకు తాను సానుకూలంగా ఉన్నానని తెలిపారు. ప్రస్తుత సమావేశం దానికి ప్రారంభం మాత్రమేనని చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్ కు థాంక్స్ చెబుతూ..ఆయనతో తన సంబంధం వ్యాపారం లాంటిదని తెలిపారు. ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే అసలు ఉక్రెయిన్ తో యుద్ధం మొదలయ్యదే కాదని పుతిన్ మరోసారి చెప్పారు.   

Also Read: TS: పదవులు మీకే..పైసలు మీకే..కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు