/rtv/media/media_files/2025/03/09/jvUTIyj1vmrC1LuhKrLK.jpg)
kethavath shankar nayak Photograph: (kethavath shankar nayak)
కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం MLA కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. విజయ శాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ లను కాంగ్రెస్ పెద్దల సభకు పంపనుంది. ఇందులో శంకర్ నాయక్, అద్దంకి దయాకర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారే. కేతావత్ శంకర్ నాయక్ రాష్ట్రవ్యాప్తంగా అంతగా తెలిసిన నాయకుడు కాకున్నా.. మిర్యాలగూడ, హుజుర్‌నగర్, నాగార్జున సాగర్, సూర్యాపేట్ ప్రాంతాల్లో బాగా తెలిసిన గిరిజన నాయకుడు. ఎన్నో ఎళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వచ్చాడు శంకర్ నాయక్.
Also read: తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారికి రుణమాఫీ కోసం రూ.33 కోట్లు మంజూరు
ప్రస్తుతం ఆయన నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాగార్జున సాగర్‌లో జానా రెడ్డికి బ్యాక్‌బోన్‌లా ఆయన పని చేశారు. అంతేకాదు.. ఆయన ఇద్దరు కుమారులు ఒకరు ఎంపీ, ఎమ్మెల్యేగా గెలవడంలో కూడా శంకర్ నాయక్ కీలక పాత్ర పోషించారు. ఎస్టీ కమ్యూనిటీకి చెందిన శంకర్ నాయక్‌కు మిర్యాలగూడ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని తండాల్లో గిరిజన బ్యాంక్ ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించింది. AICC చైర్మన్ మళ్లిఖార్జున ఖర్గే, కార్యదర్శి వేణు గోపాల్ MLC అభ్యర్థుల లిస్ట్ తయారు చేశారు. కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి, అద్దంకి దయాకర్ లకు ఎమ్మెల్సీ కేటాయించారు.@INCTelangana @revanth_anumula… pic.twitter.com/R32SjtKjOO
— RTV (@RTVnewsnetwork) March 9, 2025
Also read: BIG BREAKING: కాంగ్రెస్ MLC అభ్యర్థుల పేర్లు ఖరారు
మిర్యాలగూడలో బీఎల్ఆర్ ఎమ్మెల్యేగా గెలిపించడంలోనూ శంకర్ నాయక్ కీలకంగానే పని చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే సీటు ఆశించి శంకర్ నాయక్ నిరాశ చెందిరు. కాంగ్రెస్ అధిష్టానం అది గుర్తించి ఇప్పుడు MLCగా అవకాశం ఇచ్చింది. నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానా రెడ్డి శంకర్ నాయక్ పేరును హైకమాండ్‌కు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.