/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Thummala-jpg.webp)
చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లక్ష లోపు ఉన్న చేనేత రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రూ.33 కోట్లు మంజూరి చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా జౌళి శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చిన్నచూపుకు గురైన చేనేత రంగాన్ని సంవత్సరం కాలంలో మా ప్రభుత్వం తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకొన్నామని తెలిపారు.
Also read:Kumbh Mela: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీషీటర్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ శాఖలు tgsco నుండి బట్టలు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. చేనేత రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీ, స్కిల్స్ ను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకునేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ (IIHT) స్థాపించుకొన్నామన్నారు. ఇందులో ప్రతి సంవత్సరం 60 మంది విద్యార్థులకు మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సు (DHTT) అందించబడుతుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ చేనేత అభయహస్త పథకాన్ని కూడా అమలుచేయడానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారని ఆయన తెలిపారు. నేతన్న బీమా పథకం కింద పది లక్షల రూపాయల బీమా కల్పిస్తూ, వయోపరిమితిని తొలగించి, నేతన్న వృత్తిలో ఉన్నంతకాలం బీమా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనన్నారు.
Also read: నడిరోడ్డుపై జర్నలిస్ట్‌ను కాల్చి చంపిన దుండగులు