KCR : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రేపు కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుందని తెలిపారు. చర్చ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరారు. ఒకవేళ అసెంబ్లీకి కేసీఆర్ రానని నిర్ణయించుకుంటే కాళేశ్వరంలో తప్పులు జరిగినట్లు ఆయన ఒప్పుకున్నట్లే అని స్పష్టం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే.. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని కోమటి రెడ్డి అన్నారు. కాళేశ్వరంలో తప్పు జరిగింది కాబట్టే కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే కోర్టుకు కూడా వెళ్లారని అన్నారు.
అదే సమయంలో అసెంబ్లీ ఆవరణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. రేపు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో మా స్టార్ బ్యాట్స్‌మెన్ నువ్వే అంటూ కోమటిరెడ్డిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ వెంటనే మా కెప్టెన్ నువ్వే అంటూ ఉత్తంకుమార్ రెడ్డిని అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరిగి అన్నారు. అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్ మాట్లాడారు. రేపు అసెంబ్లీకి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నేత స్థానానికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావును, కేటీఆర్ ను అసెంబ్లీ సేషన్ లో మాట్లాడాలని కేసీర్ చెప్తున్నారు. వాళ్లే మాట్లాడిన తర్వాత కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నాయకుడిగా రాజీనామా చేయాలన్నారు.ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే
కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, ఎమెల్సీ విజయశాంతి తప్పు పట్టారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారం గన్ పార్క్ దగ్గర ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు.. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాడో తెలపాలన్నారు. అసెంబ్లీకి రావాలన్న.. కాళేశ్వరం గురించి మాట్లాడాలన్న ఆయన సిక్ అవుతాడని ఎద్దేవా చేశారు. ప్రజల చేత ఎన్నికై ప్రజల తరుపున మాట్లాడని వ్యక్తికి పదవి ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి మొత్తమే రానని చెప్పి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు విజయశాంతి.ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ఈసారైనా కేసీఆర్ సభకు వస్తున్నాడా.. రాడా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు ముద్దాయి కేసీఆరేనని.. ఆయన సభకు వచ్చి కాళేశ్వరంపై సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆయన సభకు వస్తాడా లేదంటే మమ్మల్నే ఫామ్ హౌజ్‌కు రమ్మంటాడా చెప్పాలని నిలదీశారు.
Also Read: వరద మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు.. రూ.558.90 కోట్ల నష్టం
KCR : అసెంబ్లీకి రాని కేసీఆర్ రాజీనామా చేయాలి..కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు. రాకపోతే కాళేశ్వరంలో తప్పులు జరిగినట్లు ఆయన ఒప్పుకున్నట్లే అని స్పష్టం చేశారు.
KCR should come to the assembly