/rtv/media/media_files/2025/10/28/kcr-pays-tribute-to-brother-in-law-body-2025-10-28-13-34-48.jpg)
బావ భౌతికకాయానికి కేసీఆర్ నివాళులు
KCR : మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఈ రోజు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 7వ సోదరి (అక్క) లక్ష్మిభాయి భర్త కావడంతో కేసీఆర్ ఆయన ఇంటికివెళ్లారు. బావ తన్నీరు సత్యనారాయణ రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం పుష్పాంజలి ఘటించారు. తన బావ సత్యనారాయణరావు తో తన అనుబంధాన్ని స్మరించుకున్నారు.
సత్యనారాయణరావు మృతిపట్ల విచారం వ్యక్తంచేశారు. తన సోదరి లక్ష్మిని, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. సత్యనారాయణరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంతకుముందు సత్యనారయణ రావు మృతి విషయం తెలిసిన వెంటనే కేసీఆర్ ఫోన్‌లో హరీశ్ రావును పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Follow Us