తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటి (డిసెంబర్ 9) నుంచి మొదలవుతున్న సందర్భంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులు అధినేత కేసీఆర్ తో సమావేశమైయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ మీటింగ్ నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించవాల్సిన విధి విధానాలపై చర్చించారు. ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారాని ఉత్కంఠ నెలకొంది. ఇది కూడా చదవండి : Vijaysai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు! అసెంబ్లీలో వీటి గురించి ప్రశ్నించండి : కేసీఆర్ ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని.. కానీ, చిహ్నాలు, విగ్రహాలు మార్చుకుంటూ పోతే ఎలా అని కేసీఆర్ అన్నారు. మూసీ ప్రక్షాళన, హైడ్రా అంశాల గురించి సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రొటోకాల్స్, విద్యారంగం, గురుకులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎండగట్టాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు డైరెక్షన్స్ ఇచ్చారు. నిర్భంధ పాలన, అక్రమ అరెస్టుల గురించి అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పుల గురించి మాట్లాడాలని అన్నారు. Also Read: ధరణిలో మార్పులు, కొత్త ఆర్‌వోఆర్ చట్టం.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు ఇది కూడా చదవండి: Fire Accident: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు తెలంగాణ తల్లి విగ్రహ మార్పులు ముర్ఖత్వం.. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అని ప్రశ్నించారు కేసీఆర్. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం నిప్పిన స్పూర్తిని ప్రజలకు వివరించాలని కేసీఆర్ బీఆర్ఎస్ లీడర్లతో చెప్పారు. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్చుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించాలని సూచించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఆధారంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఫిబ్రవరిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ విధా విధానాలను ఎండగడతామని చెప్పారు. Also Read: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ముగ్గురు అరెస్ట్..!