/rtv/media/media_files/2025/10/28/kavitha-arrives-at-harish-rao-house-soon-2025-10-28-08-23-19.jpg)
Kavitha arrives at Harish Rao's house soon..
Big breaking : మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఈ రోజు ఉదయం మృతి చెందారు. దీంతో తన్నీరు కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు ఆలుముకున్నాయి. కాగా ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నేతలు, రాజకీయ ప్రముఖులు, నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హరీష్ రావు ఇంటికి చేరుకుంటున్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు గారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 28, 2025
సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ రావు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఇదిలా ఉండగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. మాజీ మంత్రి హరీశ్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు గారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ రావు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అంటూ పోస్ట్ చేశారు.
అలాగే మరికొద్ది సేపట్లో కవిత హరీష్‌రావు ఇంటికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. జనంబాట పేరుతో నిజామాబాద్ నుంచి జాగృతి ఆధ్వర్యంలో యాత్ర చేపట్టిన ఆమె హరీష్‌రావు తండ్రి మృతి వార్త తెలియగానే సంతాపం వ్యక్తం చేశారు. నిజామాబాద్ యాత్రలో ఉన్న ఆమె హుటహుటినా హైదరాబాద్ బయలుదేరినట్లు తెలిసింది. నేరుగా హరీష్‌రావు ఇంటికి చేరుకుని తన్నీరు సత్యనారాయణరావు భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం హరీష్‌రావు కుటుంబ సభ్యులను పరమార్శించనున్నారు. హరీష్‌రావు తల్లి లక్ష్మీబాయి కవితకు సొంత మేనత్త అన్న విషయం తెలిసిందే.
Follow Us