Telangana: ముగ్గురు విద్యార్థులను పొట్టు పొట్టుగా కొట్టిన 15 విద్యార్థులు.. అదే కారణమట..!
నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఇంటర్ కాలేజీ స్టూడెంట్స్ మధ్య జరిగిన ఘర్షణలో 15 స్టూడెంట్స్ కలిసి ముగ్గురు విద్యార్థులను చితక బాదారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘటన జరిగిందని మండిపడుతున్నారు.