Telangana Elections 2023: కరీంనగర్ లో అర్ధరాత్రి హైటెన్షన్..పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదం నిన్న అర్ధరాత్రి కరీంనగర్ లో హై టెన్షన్ చోటు చేసుకుంది. పోలీసులే డబ్బులు పంచుతున్నారంటూ బండి సంజయ్ గొడవకు దిగారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా డబ్బులు పంచుతున్నారని ఆందోళన చేశారు. By Manogna alamuru 29 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Bandi Sanjay: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిస్సిగ్గుగా ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ (BRS) నేతలు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అర్ధరాత్రి కరీంనగర్ (Karimnagar) లో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాంతో పాటూ ఆదంఓళన కూడా చేవారు. దీంతో అక్కడ కొంతసేపు హైటెన్షన్ ఏర్పడింది. దాని తర్వాత కొత్తపల్లిలో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. Also read:ఓటర్ కార్డు లేకపోయినా ఓటేయొచ్చు..ఎలాగో తెలుసా? నేను పోలింగ్ ప్రచారం ముగిశాక మా స్థానిక నాయకుడు వాసాల రమేశ్ నివాసానికి టీ తాగేందుకు వెళ్ళానని..అప్పుడు మా కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు కొత్తపల్లిలో డబ్బులు పంచుతున్నారని సమాచారం ఇచ్చారు. దాదాపు 3 గంటల నుండి అడ్డగోలుగా డబ్బులు పంచుతున్నారు. అడ్డుకున్న మా కార్యకర్తల మీద కూడా దాడి చేశారు. నిస్సిగ్గుగా ఓటర్ లిస్టు పట్టుకుని ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇచ్చారు. తరువాత ఆ లిస్ట్ పై పెయిడ్ అని రాసుకున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పోలీసులు బీఆర్ఎస్ తొత్తలుగా మారుతున్నారంటూ బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు. కరీంనగర్ రూరల్ లో అయితే పోలీసులే డబ్బులు పంచుతున్నారు అంటూ ఆరోపించారు. తాను ఇక్కడకు వచ్చి గంట సేపైంది..ఎక్కడ చూసినా డబ్బులు పంచుతున్నారు. దాదాపు రూ. 5 కోట్లు డబ్బులు పంచారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ పూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నప్పటికీ కిందిస్థాయి సిబ్బంది మాత్రం బీఆర్ఎస్ తొత్తులుగా మారిందని బండి ఆరోపిస్తున్నారు. అందుకే ఇక మీదట నుంచి మా పార్టీ కార్యకర్తలే పెట్రోలింగ్ చేస్తారని సంజయ్ చెప్పారు. డబ్బులు పంచకుండా కాపలా కాస్తారని తెలిపారు. ఈ క్రమంలో కార్యకర్తలకు బండి పిలుపు ఇచ్చారు. కార్యకర్తలారా..ఈరోజు, రేపు అప్రమత్తంగా ఉండండి. ఎవరూ నిద్రపోకండి. పోలీసులు పట్టించుకోకుంటే మీరే పెట్రోలింగ్ చేయండి.ప్రతి కార్యకర్త పోలీసులా మారండి, బీఆర్ఎస్ నేతల డబ్బులు పట్టుకోండి. అడ్డగోలుగా సంపాదించిన సొమ్మును పట్టుకుని పేదలకు పంచండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం అంటూ బండి పిలుపునిచ్చారు. Also Read:ఉత్తరాఖండ్ టన్నెల్ సక్సెస్ వెనుక ఉన్న ఆస్ట్రేలియన్ నిపుణుడు #telangana-elections-2023 #karimnagar #bandi-sanjay మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి