TS: బీఆర్ఎస్ కు బిగ్ షాక్...కరీంనగర్ మేయర్ సునీల్ రావు రాజీనామా
బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, కరీంనగర్ మేయర్ అయిన సునీల్ రావు పార్టీకి రాజీనామా చేశారు. ఈయన రేపు బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు.
బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, కరీంనగర్ మేయర్ అయిన సునీల్ రావు పార్టీకి రాజీనామా చేశారు. ఈయన రేపు బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు హైదరాబాద్ మేయర్ , డిప్యూటీ మేయర్ పార్టీని వీడారు. తాజాగా కరీంనగర్ మేయర్ సునీల్‌రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కోపం వచ్చింది. వాట్ ఆర్ యూ డూయింగ్.. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్రంగా ఆగ్రహించారు. అది కూడా పోలీసుల మీద. కరీంనగర్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటిని పదేపదే తోసివేయడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపపై కొట్టడం సంచలనంగా మారింది. పోచారంలోని ఏకశిలానగర్‌లో కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తమ భూములను ఆక్రమించుకున్నారంటూ పలువురు ఈ రోజు ఈటలను ఆశ్రయించారు. దీంతో కోపానికి గురై బ్రోకర్ చెంప చెల్లుమనింపించారు.
తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండాగా సింగపూర్ సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను సీఎం సందర్శించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది బీఆర్ఎస్. మిగతా ఏడుగురిపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మరో షాక్ తగిలింది. రేపు విచారణకు రావాలని మాసబ్‌ట్యాంక్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే.. కరీంనగర్ కోర్టుకు తాను హాజరుకావాల్సి ఉందని.. 17న విచారణకు వస్తానని కౌశిక్ రెడ్డి పోలీసులకు తెలిపారు.
ఫార్ములా ఈ రేసు కేసుపై కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను విచారించనుంది. లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
ప్రజల కోసం పోరాటం చేస్తున్నందుకే తనపై కేసులు పెడుతున్నారని BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి మోసం చేయడంతోనే కాంగ్రెస్ పార్టీని వీడాన్నారు. RTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలు వెల్లడించారు. పూర్తి ఇంటర్వ్యూ ఈ వీడియోలో..