TG Crime: కరీంనగర్‌లో దారుణం.. పిల్లలపై కన్నతండ్రి హత్యాయత్నం.. కూతురు స్పాట్ డెడ్!

కరీంనగర్ జిల్లా వావిలాలపల్లెలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే తన ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం చేయగా, కుమార్తె మృతి చెందింది. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Karimnagar Crime News

Karimnagar Crime News

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లెలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే తన ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం చేయగా, కుమార్తె మృతి చెందింది. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల జిల్లా వెంకట్రావుపల్లికి చెందిన మల్లేశం, పోషమ్మ దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్‌లోని వావిలాలపల్లెలో నివసిస్తున్నారు. మల్లేశం కూలీగా, హమాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు ఉన్న ఇద్దరు పిల్లలు  కుమార్తె అర్చన, కుమారుడు అశ్రద్ధ అంగవైకల్యం, బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు.

కసాయిగా మారిన కన్న తండ్రి..

ఈ క్రమంలో సాయంత్రం మల్లేశం ఏం జరిగిందో తెలియదు కానీ.. తన ఇద్దరు పిల్లలను హతమార్చాలని పక్కా పథకం వేసుకున్నాడు. ఈ దాడిలో భాగంగా కుమార్తె అర్చన అప్పటికే మృతి చెందింది. కుమారుడు అశ్రద్ధను కూడా చంపే ప్రయత్నంలో ఉండగా.. కుటుంబ సభ్యులు గమనించి అడ్డుకున్నారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అశ్రద్ధను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
కుటుంబ సభ్యులు అడ్డుకునేలోపే నిందితుడు మల్లేశం అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇది కూడా చదవండి: అయ్యో పాపం.. లిఫ్ట్‌ గుంతలో పడి వృద్ధుడు మృతి

విషయం తెలుసుకున్న కరీంనగర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మృతురాలి తల్లి(పోషమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అంగవైకల్యం, బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న పిల్లలను హత్య చేయడానికి తండ్రి ఎందుకు ప్రయత్నించాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కన్న తండ్రే ఇంతటి దారుణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం, విషాదాన్ని నింపింది. పరారీలో ఉన్న మల్లేశంను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి: సూర్యాపేటలో పోలీసులపైకి దూసుకెళ్లిన కారు.. కానిస్టేబుల్ స్పాట్ డెడ్!

Advertisment
తాజా కథనాలు