సిఫార్సులకు విరుద్ధంగా గ్రౌటింగ్.. ఎన్డీఎస్‌ఏ లేఖలో బయటపడ్డ సంచలనాలు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు అవకతవకలపై నీటిపారుదల శాఖకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ మూడు బ్యారేజీల్లో పరీక్షలను త్వరగా పూర్తి చేయాలని కోరింది. నీటిపారుదల శాఖ సొంత నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేసింది. By srinivas 16 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Kaleswaram : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి నీటిపారుదల శాఖకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ(NDSA) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ మూడు బ్యారేజీలలో పరీక్షలను త్వరగా పూర్తి చేయాలని కోరింది. అలాగే ఎన్డీఎస్‌ఏ సిఫార్సులకు విరుద్ధంగా గ్రౌటింగ్ చేసినందుకే కొన్ని పనులను అంచనా వేయడానికి అవకాశం లేకుండా పోయిందని, నీటిపారుదల శాఖ స్వతహాగా నిర్ణయాలు తీసుకొని చేసిన పనుల వల్లే ఇంబ్బందులు తల్లెత్తాయంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు విడుదల చేసిన లేఖలో సంచలన విషయాలు బయటపెట్టింది. Also Read : సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఇద్దరు స్టార్ సింగర్స్.. ఫొటోలు వైరల్ సీకెంట్ పైల్స్ అంచనా వేయకుండానే పనులు.. నీటిపారుదల శాఖ తాము కమిటీ సిఫార్సులు చేసిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్స్ చేయడంలో జాప్యం చేసిందని తెలిపింది. దీంతో చాలా సమయం వృథా కావడంతోపాటు విలువైన సమాచారం కోల్పోయామని పేర్కొంది. 'అధికారుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ కుంగడానికి కారణాలు తెలుసుకోవడానికి సాక్ష్యం లేకుండా పోయింది. ప్లింత్‌శ్లాబ్ దిగువన, బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో గ్రౌటింగ్ చేయడం వల్ల మేడిగడ్డ బ్యారేజీలో సీకెంట్ పైల్స్, పారామెట్రిక్ జాయింట్ వద్ద గ్రౌండ్ కండిషన్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. సీకెంట్ పైల్స్ అంచనా వేయకుండానే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో ఎగువ సీకెంట్ పైల్స్ వద్ద కర్టెన్ గ్రౌటింగ్ చేశారు. అన్నారం బ్యారేజీలో 28, 35, 38, 44వ గేట్ల మధ్య, సుందిళ్ల బ్యారేజీలో 33, 46, 50, 52వ మధ్య సిమెంట్, అడ్మిక్స్చర్ గ్రౌటింగ్ చేశారు. దీనిపై జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. గ్రౌండ్ కండిషన్ పూర్తిగా తలకిందులు కావడంతో జియో ఫిజికల్, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసినా ఇప్పుడు ఫలితం లేదు' అని స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: ఏపీలో ఇక రెండు రకాల స్కూళ్ళు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం! అలాగే మేడిగడ్డ ఏడో బ్లాక్ 36 సిఫార్సులలో పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది కమిటీ. తమ సిఫార్సుల ప్రకారం పరీక్షలు చేసిన వాటిపై తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. మేడిగడ్డ బ్యారేజీ 7 బ్లాక్ బీటలను పర్యవేక్షించి వివరాలు కమిటీకి నివేదించాలని తెలిపింది. పియర్స్ 16 నుంచి 22 వరకు తగిన ప్రాంతంలో సపోర్టు ఏర్పాటు చేయాలని చెప్పినా చేయలేదని, దీంతో అన్‌బేస్డ్ పియర్‌కు నష్టం వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తం చేసింది. వాల్వులు డిఫెక్టివ్‌గా ఉంటే లీకేజీ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. 1 నుంచి 6 బ్లాక్, 8వ బ్లాక్ పై కూడా కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలో పాక్షికంగానే పరీక్షలు పూర్తైనట్లు లేఖలో వివరించింది. ఇది కూడా చదవండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా Also Read : బస్సులో రెచ్చిపోయిన తాగుబోతు.. మహిళా కండక్టర్ పై... #kaleswaram #medigadda #ndsa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి