Prakasam District: బస్సులో రెచ్చిపోయిన తాగుబోతు.. మహిళా కండక్టర్ పై... బస్సులో ఓ తాగుబోతు మహిళా కండక్టర్ పై రెచ్చిపోయాడు. మద్యం మత్తులో ప్రత్తిపాటి హరిబాబు అనే వ్యక్తి విచక్షణ కోల్పోయి ఆమె పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కామేపల్లిలో చోటుచేసుకుంది. By Archana 16 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update Prakasham District షేర్ చేయండి ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో ఓ తాగుబోతు మహిళా కండక్టర్ పై రెచ్చిపోయాడు. మద్యం మత్తులో వాగ్వాదానికి దిగిన హరిబాబు అనే వ్యక్తి బస్ డ్రైవర్, మహిళా కండక్టర్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళా కండక్టర్ ప్రస్తుతం కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Also Read : ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా ప్రభుత్వ పాఠశాల పై దాడి అయితే హరిబాబు పై ఇప్పటికే హరిబాబు పలు ఫిర్యాదులు నమోదయాయ్యి. కామేపల్లి ప్రభుత్వ వైద్యశాల పై కూడా దాడి చేసినట్లు తమకు ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదుల మేరకు పోలీసులు హరిబాబును అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చూడండి: ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. యువకుడు చేసిన పనికి అంతా షాక్! హైదరాబాద్‌లో దారుణ ఘటన ఇది ఇలా ఉంటే ఇటీవలే హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి అద్దె కట్టలేదని ఓ యువతిపై యజమాని దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. అత్తాపూర్ హసన్ నగర్‌లో ఓ యువతి కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లో ఉంటుంది. కొన్ని నెలల నుంచి ఇంటి అద్దె కట్టడం లేదని ఆ యజమాని యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆ యువతి చేతికి, తలకి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. కరెంట్ తీసేయడంతో వాగ్వాదం మొదలు.. ఇంటి అద్దె కట్టడం లేదని ముందుగా ఆ యువతి ఇంటికి యజమాని కరెంట్‌ను ఆపేశాడు. దీంతో యజమానికి, అద్దెకు ఉంటున్న కుటుంబానికి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆ యజమాని అద్దెకు ఉంటున్న కుటుంబంపై దాడి చేయగా.. యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ యువతి కుటుంబ సభ్యులు యజమానిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read : సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇక నుంచి ఆ బాక్స్‌లు..! Also Read: Crime: టేపుతో కట్టేసి.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. ఎముకలు విరగొట్టి.. వెలుగులోకి సంచలన నిజాలు! #drunk-drive #female-conductor #prakasam-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి