ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రి రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీకి కేటుగాళ్లు రూ.25 లక్షలు టోకరా వేశారు. ప్రభుత్వ కమిషన్‌లో ఉన్నత హోదా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశారు. దీంతో జగదీశ్ సింగ్ బరేలి కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. By Kusuma 16 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రికి ఓ దుండగులు టోకరా వేశారు. రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీకి ప్రభుత్వ కమిషన్‌లో ఉన్నత హోదాలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.25 లక్షలు టోకరా వేశారు. దీంతో జగదీశ్ సింగ్ బరేలీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చూడండి: అయ్యప్ప దర్శనాలకు పోటెత్తిన భక్తులు..తొలిరోజే ఎంతమందంటే? రాజకీయ నేతలతో దగ్గర సంబంధం ఉందని నమ్మించి.. రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ యూపీలోని బరేలీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వేరు ఫ్రెండ్ ద్వారా జగదీష్‌కి దివాకర్ గార్డ్, ఆచార్య జయప్రకాశ్ అనే వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. రాజకీయ నేతలతో అతనికి దగ్గర సంబంధాలు ఉన్నాయని జగదీష్ పటానీను నమ్మించారు. ఇది కూడా చూడండి: మెడికల్ కాలేజ్‌లో అగ్ని ప్రమాదం..10 మంది చిన్నారులు సజీవదహనం ప్రభుత్వం ఏర్పాటు అయ్యే సమయంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లేదా ఉన్నత హోదా ఇస్తామని నమ్మించారు. వారు చెప్పిన మాటలు నమ్మిన జగదీష్ డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఉన్నత హోదా ఉద్యోగ కోసం రూ.25 లక్షలు జగదీష్ నుంచి దుండగులు తీసుకున్నారు. ఈ డబ్బును వేర్వేరు అకౌంట్లలోకి బదిలీ చేశారు. అయితే మూడు నెలలు అవుతున్నా ఎలాంటి హోదా కల్పించలేదు. ఇది కూడా చూడండి: రీల్స్ చేస్తే జైలుకే..రైల్వే బోర్డు సీరియస్ డెసిషన్ అడిగితే డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు. కానీ ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వలేదు సహా.. బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. దీంతో మోసపోయానని గుర్తించి అతను పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ దుండగులు పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చూడండి: చివరి మ్యాచ్‌లో గెలుపు..3–1తో సీరీస్ కైవసం #bollywood #disha-patani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి