/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నవంబర్ 11న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. 14న ఓట్ల కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్యే గట్టి పోటీ నెలకొంది. దాదాపు 17 రోజుల పాటు ఎన్నికల ప్రచారం జరిగింది. ఇప్పటికే పలు పోల్ సర్వేలు కూడా తమ నివేదికలు విడుదల చేశాయి. కొన్ని కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పగా.. మరికొన్న బీఆర్‌ఎస్ గెలుస్తాయని చెప్పాయి. మొత్తానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే హోరాహోరీగా పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది.
Also Read: బీజేపీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు.. అత్యాచారం, కిడ్నాప్ సెక్షన్లు!
ఇదిలాఉండగా జూబ్లీహిల్స్‌లో 3.92 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ జూబ్లీహిల్స్‌లో 4000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తమ పార్టీ 30 వేల మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మరోవైపు బీఆర్‌ఎస్.. కాంగ్రెస్ హామీలను ఎన్నికల ప్రచారంలో టార్గెట్ చేసింది. హైడ్రా వల్ల పేదలు ఇళ్లు కోల్పోయారనే ప్రచారాన్ని హైలెట్ చేసింది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌నే ప్రజలు గెలిపిస్తారని కేటీఆర్ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారో తెలియాలంటే నవంబర్ 14 వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు బీహార్‌లో కూడా రెండో విడత ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
Also Read: రాత్రికి రాత్రే కూరగాయల వ్యాపారి కుబేరుడయ్యాడు..ఎలా అంటే?
Follow Us