/rtv/media/media_files/2025/10/23/jubilee-hills-elections-2025-10-23-17-52-44.jpg)
KCR road show in Jubilee Hills elections
KCR : భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్(kcr) జూబ్లీహిల్స్ బైపోల్(Jubilee Hills By Poll)పై ఫోకస్ పెట్టారు.సిట్టింగ్ సీటును ఎలాగైనా గెలుపొందేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ కీలక నేతలు, జూబ్లీహిల్స్ ఇంచార్జ్‌లతో ఎర్రవల్లి(erravalli) లో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో అభ్యర్థి మాగంటి సునీత(maganti Sunitha) తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్,హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరావు, సునీతా లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితారెడ్డి, మహమూద్ అలీ, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజ్ శ్రావణ్, రసమయి బాలకిషన్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పద్మ దేవేందర్ రెడ్డి, తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేసీఆర్ వారితో చర్చించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు, చేరికలు, ప్రచార శైలి తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
Also Read : KCR: నవీన్ యాదవ్ ఓ రౌడీ.. కేసీఆర్ సంచలన ఆరోపణలు!-VIDEO
/filters:format(webp)/rtv/media/media_files/2025/10/23/8039875a-bd63-4843-8784-39a96fd63775-2025-10-23-17-53-39.jpg)
Jubilee Hills By Elections 2025 - KCR
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఈ సమావేశం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ సందర్భంగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలు, ముఖ్యంగా ఇంటింటి ప్రచారం, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరే నాయకుల అంశాలపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులందరినీ సమాయత్తం చేయాలని ఈ సమావేశంలో కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్, హరీశ్‌రావులతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విసృత్తంగా ప్రచారం చేస్తున్నారు. ఆయా డివిజన్‌లలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనడంపై కూడా పార్టీ నేతలకు ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటే విజయం ఈజీ అవుతుందని పార్టీ శ్రేణులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కూడా కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలో పాల్గొనే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కేసీఆర్ రంగంలోకి దిగితే ఓటింగ్ సరళి మారుతుందన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేయడంతో ఆయన కూడా రెండు మూడు సమావేశాల్లో పాల్గొనడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 40 మంది స్టార్ క్యాంపెయినర్లను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకోసం ఇంటింటి ప్రచారంతోపాటు రోడ్డు షోలు, కార్నర్ మీటింగులు, కుల సంఘాలతో భేటీకి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. కేసీఆర్ కూడా రంగంలోకి దిగితే ఎన్నికలు కీలక మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
Also Read: Prabhas Fauji: "మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932".. ప్రభాస్ ప్రీ-లుక్ పోస్టర్ అదిరిపోయింది👌
Follow Us