Jubilee Hills By-Election Result: జూబ్లీహిల్స్ బైపోల్: డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు వివరాలు ఇలా..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 48.49% ఓటర్లు పోలింగ్ చేశారు. బోరబండ‌లో అత్యధికంగా 55.92%, సోమాజీగూడలో 41.99% ఓట్లు పోలయ్యాయి. ఓట్లు నవంబర్ 14 ఉదయం 8 గంటలకు యూసఫ్‌గూడ స్టేడియంలో లెక్కించనున్నారు.

New Update
Jubilee Hills By-Election Result

Jubilee Hills By-Election Result

Jubilee Hills By-Election Result: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఓట్లు లెక్కింపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 14న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. నియోజకవర్గంలో మొత్తం 48.49% పోలింగ్ రికార్డు అయ్యింది. మొత్తం 4,01,365 రిజిస్టర్ అయ్యిన ఓటర్లలో 1,94,631 మంది ఓటు వేసారు.

నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో ఓటింగ్ ఇలా.. 

  • బోరబండ: 53,211 ఓట్లలో 29,760 (55.92%)
  • రహమత్ నగర్: 74,387 ఓట్లలో 40,610 (54.59%)
  • ఎర్రగడ్డ: 58,752 ఓట్లలో 29,112 (49.55%)
  • సోమాజీగూడ: 34,653 ఓట్లలో 14,553 (41.99%)
  • యూసఫ్ గూడ్: 55,705 ఓట్లలో 24,219 (43.47%)
  • షేక్ పేట్: 71,062 ఓట్లలో 31,182 (43.87%)
  • వెంగళ్ రావు నగర్: 53,595 ఓట్లలో 25,195 (47.00%)

Also Read: మొత్తం విప్పేసి.. డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ హాట్ షో అందాలు.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

కౌంటింగ్ యూసఫ్ గూడ్ లోని కొట్ల విజయం భాస్కర్ రెడ్డి స్టేడియంలో  42 కౌంటింగ్ టేబుల్లతో, 10 రౌండ్లలో జరుగుతుంది. లెక్కింపు షేక్ పేట్ డివిజన్ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డ డివిజన్ వద్ద ముగుస్తుంది.

Also Read: భార్యాభర్తల మధ్య లొల్లి పెట్టిన కుక్క.. కోర్టు మెట్టులెక్కిన భర్త!

ఈ క్రమంలో, అన్ని రకాల పబ్‌లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, వైన్స్ నవంబర్ 14 ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 15 ఉదయం 6 గంటల వరకు క్లోజ్ చేయనున్నారు. పబ్లిక్ గ్యాదరింగ్, టపాకాయలు పేల్చడం కూడా 24 గంటలపాటు నిషేధం.

Also Read: Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ లో సంచలన విషయాలు..పేలుళ్లలో మహిళా ఉగ్రవాదుల పాత్ర

ఇలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లు (EVMs) స్టేడియం స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రతా పరంగా సురక్షితంగా ఉంచారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్, జనరల్ ఆబ్జర్వర్ రంజిత్ కుమార్ సింగ్ పర్యవేక్షణలో పోలింగ్ స్టేషన్ల నుండి స్టేడియం రిసెప్షన్ సెంటర్‌కు బదిలీ చేశారు. ఆ ప్రదేశంలోకి కేవలం అధికారికులు, ఎన్నికల సిబ్బంది మాత్రమే ప్రవేశించగలరు.

ఈ ఉపఎన్నికలో మొత్తం ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నా, వివిధ డివిజన్లలో వివిధ రకంగా ఓటింగ్ నమోదైంది. బోరబండలో అత్యధికంగా, సోమాజీగూడలో అత్యల్పంగా ఓట్లు నమోదయ్యాయి. కౌంటింగ్ ఫలితాలు రేపు తేలనున్నాయి.

Advertisment
తాజా కథనాలు