/rtv/media/media_files/2025/02/10/hFxKsIkayKbF700N3sNa.jpg)
Janasena Pawan Kalyan Ranga Rajan
Pawan Kalyan: దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు(Chilkur Balaji Temple) రంగరాజన్(Rangarajan) ను పరామర్శించాలని జనసేన పార్టీ తెలంగాణ విభాగానికి ఈ రోజు పవన్ కల్యాణ్ సూచించిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు తెలంగాణ జనసేన నేతలు రంగరాజన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధర్మ పరిరక్షణకు, ఆలయ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపన చెందుతున్న రంగరాజన్ పై దాడిని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనకు కారుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: Chilukuru Temple Priest Rangarajan : రంగరాజన్ పై దాడి వారి పనే...కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి దిశానిర్దేశం మేరకు – చిలుకూరు శ్రీ బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ @csranga గారిపై దాడిని ఖండిస్తూ ఈ రోజు వారి నివాసమునకు వెళ్లి వారిని పరామర్శించిన జనసేన పార్టీ నేతలు. పార్టీ ఉపాధ్యక్షులు మరియు… pic.twitter.com/BsCJ3lBXJT
— JanaSena Party (@JanaSenaParty) February 10, 2025
Also Read: వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?
దాడిని ఖండిస్తూ పవన్ ప్రకటన
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ పై దాడి దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం ఆయన తన X ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది ఒక వ్యక్తిపై కాదని.. ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు. చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానన్నారు.
Also Read: KA Paul: రంగరాజన్‌పై దాడికి వారే కారణం.. కేఏ పాల్ సంచలన వీడియో!
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై దాడి దురదృష్టకరం
— JanaSena Party (@JanaSenaParty) February 10, 2025
•ఒక వ్యక్తిపై కాదు... ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలి
చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. దురదృష్టకరమైన ఘటన ఇది.…
దురదృష్టకరమైన ఘటన ఇదన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా- ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారన్నారు.
Also Read: రోజ్ డే రోజు లవర్‌ని ఇలా సర్‌ప్రైజ్ చేయండి