/rtv/media/media_files/2025/02/10/QpFcnQyyfdoB13Zi4QQF.jpg)
KTR Meets Priest Rangarajan
Chilukuru Temple Priest Rangarajan: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలోనే వీసా దేవుడిగా పేరుగాంచిన బాలాజీ సేవలో ఉన్న అర్చకుడిపై దాడి చేయడాన్ని అన్నివర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు రంగరాజన్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దుర్మార్గమైన, నీచమైన చర్య. దీన్ని ఎవరు చేసినా, ఏ పేరుతో చేసినా ఉపేక్షించకూడదని అన్నారు. దేవాలయ సేవలో నిమగ్నమైన రంగరాజన్, సౌందర్య రాజ్యం కుటుంబ పరిస్థితి ఈ దాడి వల్ల ఎంతటి ఆవేదనలో ఉందో చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!
రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి..? - KTR
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఎన్నో ఏళ్ల నుంచి ఆలయంలో సేవలు అందిస్తున్నారు. అలాంటి వ్యక్తిపై దాడికి పాల్పడటం నీచమైన, దుర్మార్గమైన కార్యక్రమం. రంగరాజన్‌పై జరిగిన దాడి తెలంగాణలో శాంతి భద్రతలు ఉన్నాయా అని ప్రజలకు తెలిసేలా చేసింది. దాడికి పాల్పడింది ఎవరైనా, వారు ఏ జెండా పట్టుకున్నా.. వారి వెనుక ఎవరున్నా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. సౌందరరాజన్ గారి తనయుడు రంగరాజన్ నిత్యం దైవసేవలో పాల్గొంటారు. దేవుడికి పూజలు చేసే వారి పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన మొదలైంది. దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని’ కేటీఆర్ డిమాండ్ చేశారు. దాడికి సంబంధించి వీడియోలు, ఫొటోలు ఆధారాలున్నా నిందితులపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కౌశిక్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ తదితరులున్నారు.
Also Read: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్ కంపెనీలు
ఇక్ష్వాకు వంశం వారసులుగా ప్రకటించుకున్న వీరరాఘవరెడ్డి చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఓ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్న వీరరాఘవరెడ్డి రామరాజ్యం ఏర్పాటు అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. తన అనుచరులతో కలిసి చిలుకూరు బాలాజీ ఆలయానికి శుక్రవారం ఉదయం వీరరాఘవరెడ్డి వచ్చాడు. ఆలయ పూజారి రంగరాజన్‌తో మాట్లాడాలని పిలిచి.. రామరాజ్య స్థాపనకు ఆయన చేసిన ప్రతిపాదనను రంగరాజన్ తిరస్కరించారు. దాంతో ఆవేశానికి లోనైన వీరరాఘవరెడ్డి, అతడి అనుచరులు రంగరాజన్ పై దాడి చేయగా, అర్చకుడి కన్నుకు తీవ్ర గాయమైంది. రంగరాజన్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అతడి అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: కష్టాన్ని ఇష్టంగా చేసుకోండి.. విద్యార్థులతో ప్రధాని ఇంట్రెస్టింగ్ చిట్ చాట్