/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t071559888-2025-11-20-07-16-19.jpg)
Upasana Kamineni
Upasana Kamineni : ఉపాసన..అందరికీ సుపరిచితమైన పేరు. అపోలో సీఎస్‌ఆర్ వైస్ ఛైర్‌పర్సన్, నటుడు రామ్‌చరణ్ సతీమణిగా అందరికీ తెలిసు. అయితే తను ఎలాంటి చర్చ లేవనెత్తిన దానిపై సరైన వివరణ ఇవ్వడంలో ముందుంటారు. అలాంటిదే ఇటీవల ఆమె పెట్టిన పోస్ట్ చర్చనీయంశమైంది. పెళ్లికి సంబంధించి ఆమె పెట్టిన పోస్టుపై జోహో సీఈఓ శ్రీధర్ వెంబు లాంటి ఎంతో మంది ప్రముఖులు సహా పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందించారు. కొందరు ఉపాసన పోస్ట్‌ను విమర్శించగా.. మరికొందరు మద్దతుగా కామెంట్లు చేశారు. ఆ భిన్నాభిప్రాయాలపై ఉపాసన తాజాగా రియాక్ట్ అయ్యారు. దానికి మరో పోస్టు పెట్టారు. ‘‘నా పోస్టుపై ఆరోగ్యకర చర్చను లేవనెత్తినందుకు ఆనందిస్తున్నా. స్పందించిన వారికి థాంక్స్’’ అంటూ పలు ప్రశ్నలు సంధించారు. అంతేకాదు ‘ఫ్యాక్ట్ చెక్’ పేరిట తన వివాహం, సంతానానికి సంబంధించిన ప్రణాళికలను వెల్లడించారు.‘‘సరైన భాగస్వామి ఎదురయ్యే వరకూ అమ్మాయి వేచి చూడటం తప్పా?’, ‘పిల్లలకు ఎప్పుడు జన్మనివ్వాలన్నది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం తప్పా?’’ అంటూ సూటిగా ప్రశ్నలను సంధించారు.
అంతేకాదు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వివరిస్తూ ‘‘27 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నా. వ్యక్తిగత, ఆరోగ్య కారణాల వల్ల 29 ఏళ్ల వయసులో నా ఎగ్స్‌ను ఫ్రీజ్ చేయాలని నిర్ణయించుకున్నా. 36వ ఏట ఓ బిడ్డకు జన్మనిచ్చా. ప్రస్తుతం నాకు 39 ఏళ్లు. త్వరలో కవలలకు జన్మనివ్వబోతున్నా. వ్యక్తిగత జీవితానికి ఎంత ప్రాధాన్యమిచ్చానో కెరీర్ నిర్మాణానికి అంతే. నా దృష్టిలో పెళ్లి- కెరీర్ ఒకదానితో మరొకటి పోటీ కాదు. కానీ, ప్రతిదానికీ ప్రత్యేక సమయం ఉంటుందని భావిస్తున్నా’’ అని ఉపాసన పేర్కొన్నారు.
ఉపాసన ఇటీవల ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో ముచ్చటించారు. దానికి సంబంధిత వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె పెళ్లి చేసుకుంటున్నారా..? అని అడిగిన ప్రశ్నకు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా చేతులు పైకెత్తారని వెల్లడించారు. ‘‘మహిళలు కెరీర్‌ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టారని దీనిని బట్టి అర్థమైంది. ఇది సరికొత్త భారత్’’ అని తన పోస్టులో ఆమె రాసుకొచ్చారు. అమ్మాయిలకు పెద్ద ఇన్సూరెన్స్ అండాలు దాచిపెట్టుకోవడమని, దానివల్ల ఎప్పుడు పిల్లల్ని కనాలన్నది తమ చేతుల్లోనే ఉంటుందని ఆ వీడియోలో చెప్పారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిదని ఉపాసన అభిప్రాయపడ్డారు.
కాగా, ఉపాసన పోస్టుపై స్పందించిన జోహో సీఈఓ శ్రీధర్ వెంబు "యువత 20ల్లోనే పెళ్లి చేసుకొని.. పిల్లల్ని కనాలని 'అన్నారు. ‘‘యువత 20ల్లోనే పెళ్లి చేసుకొని.. పిల్లల్ని కనాలని నేను సలహా ఇస్తుంటాను. వారు తమ సమాజం, పూర్వీకుల కోసం ఈ విధిని నిర్వర్తించాలి. ఇవన్నీ పాతకాలం మాటల్లా అనిపిస్తాయి. అయితే మళ్లీ ఈ మాటలే ప్రతిధ్వనిస్తాయని నేను భావిస్తున్నాను’’ అని ఒక పోస్ట్ చేశారు. అయితే శ్రీధర్ సలహాపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. యువత వివాహాలు వాయిదా వేయడం వెనక ఆర్థిక ఒత్తిడులు ప్రధాన కారణమని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
Also read: ఇండియాలో భారీ దాడులకు జైషే కుట్ర.. ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణ
Follow Us