Revanth Reddy: బాలల దినోత్సవం వేళ.. సీఎం రేవంత్ గుడ్‌న్యూస్‌

విద్యార్థుల కలలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తామని పేర్కొన్నారు.

New Update
Revanth 5

విద్యార్థుల కలలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' రాష్ట్ర ఏర్పడ్డాక తొలిసారిగా బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తాం. ఇటీవలే హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాము. 

Also Read: తెలంగాణ బీజేపీలో గందరగోళం.. లగచర్ల ఘటనపై ఒక్కో నేతది ఒక్కో మాట!

Children's Day - Revanth Reddy

గత పదేళ్లలో 5 వేల పాఠశాలలు మూతబడ్డాయి. బడ్జెట్‌లో 7 శాతానికి పైగా నిధులు విద్యాశాఖకు అందించాం. ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని పదోన్నతులు కూడా ఇచ్చాం. బదిలీలు చేశాం. 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. టీచర్ పోస్టులను భర్తీ చేసి విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నిరూపించాం. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు చాలామంది ఇష్టపడటం లేదు. విద్యావ్యవస్థను మెరుగుపరిచేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం.

 ప్రభుత్వ టీచర్లకు ఉన్న అర్హత ప్రైవేటు టీచర్లకు లేదు. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమించాం. ప్రభుత్వ బడుల ప్రతిష్టను పెంచే బాధ్యత టీచర్లదే. ప్రజాప్రతినిధులు గ్రామాల్లో విద్యార్థులను కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలి. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 7 వరకు విజయోత్సవాలు నిర్వహిస్తాం.  

Also Read: సరికొత్త హంగులతో ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాల.. చూస్తే మతిపోవాల్సిందే

 అధికారులు జిల్లాల్లో రెండ్రోజుల పాటు పాఠశాలలను పర్యవేక్షించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలి. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో మంచి అన్నం పెట్టాలి. దొడ్డు బియ్యం, కుళ్లిపోయిన కూరగాయలతో భోజనం పెడితే సహించేది లేదు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకు పంపుతామని'' సీఎం రేవంత్ అన్నారు. అలాగే విద్యార్థులు దేశానికి ఆదర్శంగా ఉంటామని.. ఎలాంటి చెడు వ్యవనాలకు బానిసలు కాబోమని విద్యార్థులు ప్రమాణం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Also Read :  వాట్సాప్‌ను నిషేధించాలని సుప్రీంకోర్టులో పిల్.. చివరికీ

Also Read :  నెట్టింట 'బేబమ్మ' క్యూట్ ఫోజులు.. ఒక్క చూపుకే కుర్రాళ్ళు ఫిదా! 

Advertisment
Advertisment
తాజా కథనాలు