WhatsApp: వాట్సాప్‌ను నిషేధించాలని సుప్రీంకోర్టులో పిల్.. చివరికీ కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వాట్సాప్ పాటించడం లేదని దీన్ని నిషేధించాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్ వేశాడు. అయితే దీన్ని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 14 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి స్మార్ట్‌ఫోన్ వాడేవారిలో వాట్సాప్ వాడకుండా ఎవరూ ఉండలేరు. ప్రతిరోజూ వాట్సాప్ వాడకం అనేది అందరికీ ఓ అలవాటుగా మారిపోయింది. అయితే వాట్సాప్‌ను నిషేధించాలని కోరుతో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాఖ్యం(PIL) దాఖలైంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వాట్సాప్ పాటించడం లేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పిల్ వేశాడు. అయితే దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. Also Read: సరికొత్త హంగులతో ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాల.. చూస్తే మతిపోవాల్సిందే యూరప్‌కి ఒకలా మనకి ఒకలా ? ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అక్కడి హైకోర్టును ఆశ్రయించాడు. వాట్సాప్ సంస్థ ఐటీ నింబంధనలు -2021 పాటించడం లేదని ఆరోపించాడు. యూజర్ వైపు మార్పులు చేసే ఆస్కారం ఉందని.. అలాగే సందేశం మూలాలు కనుక్కోవడం కూడా అసాధ్యమని పేర్కొన్నాడు. అయితే వాట్సాప్ యూరప్‌లో వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోందని.. కానీ ఇండియాలో మాత్రం ఇక్కడి చట్టాలు పాటించడం లేదని ఆరోపించాడు. Also Read : డిస్టెన్స్ రిలేషన్ షిప్లో ఈ తప్పులు చేస్తే బంధం ముక్కలే..! అయితే ఈ పిటిషన్‌పై విచారించిన కేరళ హైకోర్టు.. ఇది తొందరపాటు చర్యగా పేర్కొంది. అతడి పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో ఆ వ్యక్తి చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పౌరుల ప్రాథమిక హక్కులను వాట్సాప్ ఉల్లంఘిస్తోందని.. జాతీయ ప్రయోజనాలకు ముప్పుగా మారిందని ఆరోపణలు చేశాడు. సాంకేతికతను మార్చకుండా ప్రభుత్వానికి సహకరించకుంటే దేశంలో వాట్సాప్ కార్యకలాపాలను నిషేధించాలని సూచించాడు. Also Read: ప్రధాని మోదీకి మరో అరుదైన పురస్కారం.. ఏ దేశం ఇవ్వనుందంటే ? కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటించని అనేక మొబైల్ యాప్‌లు, వైబ్‌సైట్లు దేశంలో నిషేధించబడ్డాయని గుర్తుచేశారు. అయితే ఈ పిల్‌ను పరిశీలించిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం దాన్ని కొట్టివేసింది. కేరళ వ్యక్తి దాఖలు చేసిన ఈ పిల్‌ను స్వీకరించడానికి మొగ్గు చూపడం లేదని పేర్కొంది. Also Read: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమాన సర్వీసులకు ఆటంకం.. #telugu-news #social-media #whatsapp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి