Atishi: సరికొత్త హంగులతో ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాల.. చూస్తే మతిపోవాల్సిందే

ఢిల్లీలోని సుందర్‌నగరిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నూతన ప్రభుత్వ పాఠశాలను నిర్మించారు. సీఎం అతిశీ గురువారం ఈ పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలలో 131 గదులు, 7 ల్యాబ్‌లు, లైబ్రరీ, లెక్చర్ హాలు, లిఫ్ట్‌ లాంటి మెరుగైన సదుపాయాలు ఉన్నాయి.

New Update
Delhi school

దేశంలో విద్యారంగానికి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే రాష్ట్రాల్లో ఎప్పుడూ కూడా ముందుండే రాష్ట్రం ఢిల్లీ. అక్కడి పాఠశాలల్లో ఉన్న మెరుగైన మౌలిక సదుపాయాలు దేశానికే ఆదర్శంగా మారాయి. ఢిల్లీ స్కూళ్లపై అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు వచ్చాయి. అయితే అక్కడి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఓ అతిపెద్ద పాఠశాలను నిర్మించారు. 

Also Read: CBSE బోర్డు కీలక నిర్ణయం.. విద్యార్థులకు గుడ్ న్యూస్

World Class Govt School

సుందర్‌నగరిలో సరికొత్త హంగులతో ఈ ప్రభుత్వ పాఠశాలను నిర్మించారు. ముఖ్యమంత్రి అతిశీ గురువారం ఈ పాఠశాలను ప్రారంభించారు. బాలల దినోత్సవం సందర్భంగా ప్రపంచస్థాయి పాఠశాలను విద్యార్థులకు అంకితం చేయడంపై సీఎం అతిశీ ఆనందం వ్యక్తం చేశారు. ఎక్స్‌ వేదికగా పాఠశాల ఫొటోలను పోస్టు చేశారు. భూ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న స్థలంలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో ఈ పాఠశాలను నిర్మించామని తెలిపారు. ఈ కొత్త పాఠశాల 7 వేల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. 

Also Read :  శ్రీచైతన్యలో మరో దారుణం.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Also Read:  ప్రధాని మోదీకి మరో అరుదైన పురస్కారం.. ఏ దేశం ఇవ్వనుందంటే ?

అదునాతన వసతులతో నిర్మించిన ఈ పాఠశాలలో 131 గదులు, 7 ల్యాబ్‌లు, లైబ్రరీ, లెక్చర్ హాలు, లిఫ్ట్‌ లాంటి మెరుగైన సదుపాయాలు సైతం కల్పించామని తెలిపారు. ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలను అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే నిర్మించగలరని ఢిల్లీ ప్రజలకు తెలుసని అన్నారు. విద్యారంగంపై కృషి చేసే ఆప్ ప్రభుత్వాన్నే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ ఎన్నుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  

Also Read: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమాన సర్వీసులకు ఆటంకం..

Also Read :  నార్సింగిలో విషాదం.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

Advertisment
తాజా కథనాలు