/rtv/media/media_files/2025/05/01/rD5qkSjMQ3RaVJ8PJvEq.jpg)
Vande Bharat Food
తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ లో నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ తో పాటూ భోజనానికి కూడా డబ్బులు చెల్లిస్తున్నామని...అయినా కూడా కనీస శుభ్రత కూడా లేకుండా పురుగుల ఆహారాన్ని పెడుతున్నారని మండిపడుతున్నారు. నిన్న వందే భారత్ లో ప్రయాణించిన ఓ ప్రయాణికుడికి ఇచ్చిన భోజనంలోని సాంబార్ లో పురుగులు కనిపించాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అతను వెంటనే రైల్వే అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
నూడుల్స్ తో సరిపెట్టారు..
ట్రైన్ లో పురుగులు కనిపించగానే ప్యాసింజర్ గొడవ చేయడంతో అతనికి వెంటనే నూడుల్స్ ఇచ్చి సర్ది చెప్పారు. అయితే తాను ఫుల్ మీల్ కు డబ్బులు చెల్లించానని...తనకు ఇన్సటంట్ నూడుల్స్ పెట్టి సరిపెట్టడానికి ప్రయత్నించారని ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి వందే భారత్ లో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అతను కోరారు.
today-latest-news-in-telugu | vande-bharat | train | food | insects