Telangana: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు షాక్.. రేవంత్ సర్కార్‌ కీలక షరతు

ఇందిరమ్మ ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే కట్టుకోవాలని ప్రభుత్వం షరతు పెడుతోంది. దీంతో లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు. 280 మందికి పైగా 600 చదరపు అడుగులకు పైగానే ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్లు అధికారులు గుర్తించారు.

New Update
Indiramma Housing Scheme

Indiramma Housing Scheme

ఇందిరమ్మ ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే కట్టుకోవాలని ప్రభుత్వం షరతు పెడుతోంది. దీంతో లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మొదటి విడుతలో భాగంగా రాష్ట్రంలో 70,122 ఇళ్లకు ప్రభుత్వం ముందుగా పర్మిషన్ ఇచ్చింది. ఇందులో ఇప్పటికే 2830 మంది లబ్ధిదారులు పునాదిని పూర్తి చేసుకున్నారు. అయితే ఇందులో దాదాపు 280 మందికి పైగా 600 చదరపు అడుగులకు పైగానే ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. 

Also Read: యుద్ధానికి సిద్ధం !.. 40 లక్షల రిటైర్ట్‌ సైనికులను పిలిస్తున్న పాక్ ఆర్మీ

దీంతో మొదటి విడత బిల్లు రూ.లక్ష విడుదల చేసేందుకు నిరాకరించారు. మళ్లీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునాదిలో మార్పులు చేసుకుంటూనే బిల్లులు అందిస్తామని అంటున్నారు. ఇదిలాఉండగా.. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో భాగంగా సొంత స్థలాలు ఉన్నవాళ్లు తమకు నచ్చిన విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని కూడా చెప్పింది. మోడల్ ఇళ్లను లబ్ధిదారులకు అందుబాటులో ఉంచినప్పటికీ కూడా ఎలాంటి రూల్స్‌ పెట్టమని తెలిపింది.  

అయితే తాజాగా అధికారులు 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే ఇంటిని నిర్మించుకోవాలని చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పాటు తాము అదనంగా ఖర్చు పెట్టి ఇంటిని నిర్మించుకుంటున్నామని.. ఇప్పుడు ఇలాంటి రూల్స్ పెడితే ఎలా అంటూ మండిపడుతున్నారు. 

Also Read: ఇంకా దిగజారకు.. పాక్‌ మాజీ కెప్టెన్‌‌కి ధావన్ దిమ్మతిరిగే కౌంటర్!

మరోవైపు ఇందిరమ్మ ఇళ్లు 600 చదరపు అడుగులు దాటితే వాళ్లు బిలో పావర్టీ లైన్ (BPL) కిందకి రారని అధికారులు చెబుతున్నారు. పేదల ఇళ్లను 400 చదరపు అడుగుల్లోనే నిర్మించాలని.. దీనికి ప్రభుత్వం 200 చదరపు అడుగులు అదనంగా పెంచిందని హౌసింగ్ శాఖ చెబుతోంది. ఇక మే 5వ తేదీలోపు ఇందిరమ్మ ఇళ్ల రెండో లిస్ట్ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఉండాలన్న నిబంధనను విస్త-ృతంగా ప్రచారం చేయాలని జిల్లా యంత్రంగానికి గృహనిర్మాణ శాఖ అధికారులు ఆదేశిస్తున్నారు. 

Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం

 indiramma housing | indiramma housing scheme | telangana | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు