/rtv/media/media_files/2024/11/26/zBUu0wMkzmc2L2Fedooe.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరోక్షంగా స్పందించారు. బై ఎలక్షన్‌లో బీఆర్ఎస్ ఓటమిపై ఆమె సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఆమె కర్మ హిట్ బ్యాక్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో కవిత ఇన్‌డైరెక్ట్‌గా BRS పార్టీపైనే ఈ ట్వీట్ చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Karma hits back !!! 🙏🙏🙏🙏
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 14, 2025
గత కొన్ని రోజులు ఆమె బీఆర్‌ఎస్ పార్టీ తీరుతో విభేధించి తరుచూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకళాపాలకు పాల్పడుతున్నారని కారణంతో కవితపై బీఆర్ఎస్ యాక్షన్ తీసుకుంది. ప్రస్తుతం కవిత జాగృతి జనం బాట అనే యాత్ర చేపట్టింది తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పర్యటనలు చేస్తోంది. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావుతో ఆమెకు విభేదాలు ఉన్నట్లు బహిరంగంగానే కవిత చెప్పారు. పార్టీ నుంచి బయటకు వచ్చాక కవిత జాగృతి కార్యకలాపాలపై దృష్టి పెట్టారు.
Follow Us