/rtv/media/media_files/2026/02/10/hydra-2026-02-10-21-45-18.jpg)
Hydra
హైదరాబాద్‌లో ఆక్రమణకు గురైన భూములను హైడ్రా విడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో రూ.1500 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూములు, పార్క్ స్థలాలను ఆక్రమణల నుంచి తాజాగా హైడ్రా రక్షించింది. ఆ తర్వాత ఈ భూముల చుట్టు కంచె వేసి బోర్డులు ఏర్పాటు చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్‌లోని 4 ఎకరాల కుంటను పూడ్చేసి ప్లాట్లుగా అమ్మేందుకు కబ్జాదారులు ప్రయత్నించారు. హైడ్రా అధికారులు కబ్జాదారులను అదుపులోకి తీసుకొని రూ.700 కోట్ల విలువైన భూమిని రక్షించారు. రెవెన్యూ అధికారులతో కలిసి వాళ్లపై కేసు నమోదు చేశారు.
Also Read: వివాదంలో 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' బుక్.. ఎట్టకేలకు మౌనం వీడిన మాజీ ఆర్మీ చీఫ్ నరవణె
అల్వాల్ మండలంలోని కొత్త చెరువును 8 ఎకరాల వరకు ఆక్రమణ చేశారు. చెరువులోని FTL పరిధిలో ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యకలాపాలతో చెరువును కలుషితం చేస్తున్నారని స్థానికుల ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా వాటిని తొలగించింది.
Also Read: సోషల్ మీడియా సంస్థలకు షాక్.. ఏఐ కంటెంట్‌పై కేంద్రం కీలక ఆదేశాలు
ఇక వనస్థలిపురంలోని జక్కిడినగర్ కాలనీలో 650 గజాల పార్క్ స్థలాన్ని కూడా కబ్జాదారుల నుంచి హైడ్రా రక్షించింది. అలాగే మౌలాలి సర్కిల్ పరిధిలోని రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్క్ స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడింది. ఈ రెండు స్థలాలకి కూడా హైడ్రా అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు GHMCకి గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చిన పార్కు స్థలాన్ని ఆక్రమించి కట్టిన ప్రహరీతో సహా రేకుల షెడ్డును హైడ్రా తొలగించింది.
Follow Us