/rtv/media/media_files/2026/02/10/general-naravane-breaks-silence-on-unpublished-book-2026-02-10-20-17-21.jpg)
General Naravane breaks silence on unpublished book
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం నరవణె రాసిన ''ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'' పుస్తకం విడుదలకు ముందే వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఈ పుస్తకం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ ఆర్మీ చీఫ్ నరవణె ఈ బుక్ వ్యవహారంపై మౌనం వీడారు. తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రచురణ సంస్థ 'పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా' (PRHI) విడుదల చేసిన వివరణను షేర్ చేశారు. దీనికి ''నా పుస్తకం ప్రస్తుత స్థితి ఇదే'' అని రాసుకొచ్చారు. దీనిప్రకారం ఈ వివాదంలో ఆయన పూర్తిగా పబ్లిషర్ వాదనకే సపోర్ట్ చేశారు.
This is the status of the book. https://t.co/atLtwhJvl0
— Manoj Naravane (@ManojNaravane) February 10, 2026
Also Read: సోషల్ మీడియా సంస్థలకు షాక్.. ఏఐ కంటెంట్‌పై కేంద్రం కీలక ఆదేశాలు
పబ్లిషర్ చెప్పిన వివరాల ప్రకారం ఈ పుస్తకం ఇప్పటిదాకా ముద్రణ రూపంలో గానీ, డిజిటల్ రూపంలో గానీ ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. మార్కెట్‌లో లేదా సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రతులు అనధికారికమైనవి. ఇవన్నీ కాపీరైట్ ఉల్లంఘన కిందకే వస్తాయి. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి తుది అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని.. అందుకే ప్రచురణ ఆలస్యమవుతోందని ప్రచురణ సంస్థ పెంగ్విన్ వెల్లడించింది.
Also Read: 10 రోజుల్లోనే పాకిస్థాన్ యూటర్న్.. భారత్‌తో మ్యాచ్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్
మరోవైపు ఈ వివాదంపై పార్లమెంటు బయట విపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. నరవణె 2023లో చేసిన ఓ పాత పోస్ట్‌ను ప్రస్తావించారు. ఈ పుస్తకం అందుబాటులో ఉందని గతంలోనే నరవణె ట్వీట్ చేశారని ఆరోపించారు. కానీ ఇప్పుడు పబ్లిషర్ ఇది అందుబాటులో లేదని చెబుతున్నారని.. వీళ్లలో ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారని అన్నారు. తానూ మాజీ ఆర్మీ చీఫ్ మాటలనే నమ్ముతున్నానని పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఈ బుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Follow Us