Bhopal Gas: భారతదేశ చరిత్రలోనే అది మరిచిపోలేని రోజు. 5,479 మందిని పొట్టనబెట్టుకున్న విషాద ఘటన. దాని వల్ల ఇప్పటికీ లక్షల మంది ఆరోగ్య సంబంధిత సమస్యలు, అంగ వైకల్యంతో బాధపడుతున్నారు. ఇంతమంది ప్రాణాలు తీసిన ఫ్యాక్టరీని 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఓపెన్ చేస్తున్నారు. చిన్న గ్యాస్ లీక్ అయినందుకే 5వేల మంది చినిపోయారు.. మరి ఇప్పుడు 377 టన్నుల ప్రాణాంతకమైన వ్యర్థాలు 250 కిలో మీటర్లు ఎలా తరలిస్తారు..? మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రమాదకరమై విషవాయువుతో చెలగాటమా..? 1984 డిసెంబర్ 2 రాత్రి ఏం జరిగింది..? మళ్లీ భోపాల్ గ్యాస్ లీకేజ్ లాంటి దుర్ఘటన చోటుచేసుకునే ప్రమాదం ఉందా..? కిలో మీటర్ల మేరా ప్రజలు ఆ వాయువు పీల్చి.. అది 1984 డిసెంబర్ 2 అర్థరాత్రి.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ టౌన్ ఆదమరిచి ఘాడ నిద్రపోతుంది. యూనియన్ కార్బైడ్ పురుగుమందుల ఫ్యాక్టరీలో ప్రమాదకరమైన గ్యాస్ లీకైంది. ఫ్యాక్టరీ చుట్టుప్రక్కల కిలో మీటర్ల మేరా ఉన్న ప్రజలు ఆ వాయువు పీల్చి గిలగిలా కొట్టుమిట్టారు. 5,479 మంది అక్కడికక్కడే చనిపోయారు. అంతేకాదు తర్వాత చికిత్సపొందుతూ కూడా మరో వెయ్యి మంది చనిపోయారు. 5 లక్షల మందికి పైగా కాళ్లుచేతులు, ఇతర అవయవాలు పని చేయకుండా అంగవైకల్యానికి గురైయ్యారు. ఇది ఇండియా చరిత్రలోనే కన్నీటీ కథ. ఎంతోమంది ఆర్తనాదాలతో ఆరోజుంతా దేశం అట్టుడికిపోయింది. ఇది ప్రపంచంలోనే అదిపెద్ద పారిశ్రామిక విపత్తుల్లో ఒకటిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం ఇచ్చి.. ఆ ఫ్యాక్టరీని మూసివేసింది. 2024 మార్చి 23న సుప్రీం, హైకోర్టులు ఆ వ్యర్థాలను తొలగించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని గుర్తు చేసింది. 2024 డిసెంబర్ 3న మధ్యప్రదేశ్ హైకోర్టు వర్థాల తొలగింపుకు 4 వారాల టైం ఇచ్చింది. ప్రభుత్వం ఆదేశాలను పాటించకుంటే ధిక్కార చర్యలు తీసుకుంటామని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. 2025 జనవరి 3న ప్రభుత్వం కోర్టులో వ్యర్థాల నిర్మూలన అఫిడవిట్‌ను సమర్పించాలని, జనవరి 6న ప్రభుత్వం కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. 2025 జనవరి 3 నాటికి తొలగిస్తామని.. ఆ రాష్ట్ర గ్యాస్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ భోపాల్ దుర్ఘటనకు కారణమైన వ్యర్థాలను 2025 జనవరి 3 నాటికి తొలగిస్తామని మీడియాతో చెప్పారు. ప్రాణాంతకమైన 377 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ 250 కిలో మీటర్ల తరలించి ధార్ జిల్లా పీతాంపూర్ డిస్పోజల్ యూనిట్‌లో వ్యర్థాలను కాల్చివేస్తామని అన్నారు. 2015లోనే పీతాంపూర్ డిస్పోజల్ యూనిట్‌లో 10 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ ప్రయోగాత్మకంగా ద్వంసం చేశారు. ఇప్పుడు మిగిలిన 367 టన్నుల విషవ్యర్థాలను క్లియర్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం పోలీస్ ఫోర్స్‌తోపాటు 300 మంది సిబ్బందిని కేటాయించారు. 12 స్టీల్ కంటెనర్లలో వ్యర్థాలను తరలించడానికి 250 కిలో మీటర్లు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. 2024 డిసెంబర్ 30 నుంచి 100 మంది వ్యర్థాలను ప్యాక్ చేసి స్టీల్ కంటేనర్‌లోకి ఎక్కించారు. పీపీటీ కిట్లు ధరించి సిబ్బంది వ్యర్థాలను లోడ్ చేశారు. వాటిలో 162 మెట్రిక్ టన్నుల మట్టి, 92 మెట్రిక్ టన్నుల సీమ్, నాఫ్తాల్ అవశేషాలు, 54 మెట్రిక్ టన్నుల సెమీ ప్రాసెస్డ్, 29 మెట్రిక్ టన్నుల రియాక్టర్ వ్యర్థాలు ఉన్నాయని తెలిపారు. ఇది కూడా చదవండి: ఆరేళ్ళ తర్వాత లుక్ మార్చిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న బన్నీ న్యూ లుక్ 12 కంటేనర్లతోపాటు పోలీస్ ఫోర్స్.. జనవరి 1న రాత్రి 12 కంటేనర్లతోపాటు పోలీస్ ఫోర్స్, అంబులెన్స్, డాక్టర్లు, ఫైర్ బ్రిగేడ్ అండ్ క్విక్ రెస్పాన్స్ టీమ్‌లతో సహా 25 వాహనాల కాన్వాయి పీతాంపూర్‌కు చేరుకుంది. మిథైల్ ఐసోసైనేట్ వేస్టేజ్ కాల్చి వచ్చిన బూడిదను బలమైన రెండు లేయర్ ప్రొటెక్షన్‌లో ప్యాక్ చేస్తామని శాస్త్రవేత్తుల చెప్పారు. అవి మట్టి, నీటీలో కలవకుండా ఎత్తైన ప్రదేశంలో పాతిపెట్టనున్నారు. 367 టన్నుల వ్యర్థాలను కాల్చడానికి 3 లేదా 9 నెలల టైం పడుతుందని స్వతంత్ర కుమార్ సింగ్ చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Ssc Gd Constable 2025: 39,481 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పరీక్ష తేదీల్లో మార్పులు! వ్యర్థాల తొలగింపుపై భిన్న అభిప్రాయాలు 1.75 లక్షల జనాభా ఉన్న పితాంపూర్‌లో వ్యర్థాలు కాల్చ కూడదని ఆదివారం పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు. పీతాంపూర్‌ను మరో భోపాల్‌గా మారనివ్వమని, పీతాంపూర్‌ను రక్షించడని నినాదాలు చేస్తూ.. పర్యావరణ కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర కుమార్ సింగ్ వాళ్ల నిరసణను ఖండించారు. 2015లో చేసిన టెస్ట్ రిపోర్ట్‌లో ఆ ప్రాంతానికి ఏ ప్రమాదం ఉండదని.. అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే పితాంపూర్‌లో వ్యర్థాలను పారవేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రమాదం జరిగి 40 ఏళ్లు అవుతున్నా ఆ విషవ్యర్థాలు ఇంకా నిష్క్రియాత్మక స్థితిలోనే ఉన్నాయని.. మరో ప్రమాదం చోటు చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. ఈ విషయం అందరిని భయాందోళనకు గురి చేస్తోంది. మిథైల్ ఐసోసైనేట్ కాల్చే ట్రైంలో అనుకోని ఘనట ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? , ఈ 40ఏళ్లలో ఆ వ్యర్థాలను క్లియర్ చేసే టెక్నాలజీ కనిపెట్టలేదా అని ప్రజల నుంచి ప్రశ్నలు తలెత్తున్నాయి. వ్యర్థాల తొలగింపుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.