Crime News: సికింద్రాబాద్‌లో తల్లి శవంతో 8రోజులు.. ఇంట్లో గడిపిన ఇద్దరు కూతుళ్లు

సికింద్రాబాద్ ఓ మహిళ చావు మిస్టరీగా మారింది. లలిత చనిపోయిన 8 రోజులు అవుతున్నా ఆమె ఇద్దరు కూతుళ్లు మృతదేహం ఇంట్లోనే ఉంచి బయటకు తెలియనివ్వలేదు. శుక్రవారం వాళ్లే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు.

author-image
By K Mohan
New Update
Secundrabad Varasiguda Crime News

Secundrabad Varasiguda Crime News

Crime News: సికింద్రాబాద్‌ వారాసిగూడ(Secundrabad Varasiguda)లో మిస్టరీగా మారిన తల్లి చావు. తల్లి డెడ్‌బాడీతో ఇద్దరు కూతుళ్లు 8 రోజులపాటు అదే ఇంట్లో సహజీవనం చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళ చనిపోయి 8 రోజులు కావస్తు్న్నా ఇద్దరు కూతుళ్లు ఆ విషయం బయటకు తెలయనివ్వలేదు. లలిత ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా హత్య చేశారా అని అనేది ఇంకా తెలియదు. ఆమె ఇద్దరు కూతుళ్లు తల్లి చనిపోయిందని శుక్రవారం పోలీస్ ష్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి : Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు!

తల్లి చనిపోవడంతో ఇద్దరు కూతుర్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ల చేతులపై కత్తితో కోసుకున్న గాయాలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి లలిత డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కూతుళ్లను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లలిత మరణానికి కారణం ఏమైఉటుందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమె మృతి గురించి 8 రోజులుగా బయటకు ఎందుకు చెప్పలేదని కూతుళ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇది కూడా చదవండి : AP-Mumbai: ఏపీ యువతిని ముంబైలో రేప్ చేసి చంపిన యువకుడు.. నిర్దోషిగా విడుదల చేసిన సుప్రీంకోర్టు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు