హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. మరో 8 స్టీల్ బ్రిడ్జ్‌లు, 6 అండర్ పాస్‌లు

రైజింగ్ హైదరాబాద్ స్కీమ్‌తో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రాక్చర్ పేరుతో కేబీఆర్ పార్క్ జంక్షన్ సమీపంలో 8 స్టీల్ బ్రిడ్జ్‌లు, 6 అండర్ పాస్‌లు నిర్మించనుంది.

New Update
hyderabad roads

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రైజింగ్ హైదరాబాద్ అనే స్కీమ్‌తో ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేయాలని భావిస్తోంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రాక్చర్ పేరుతో సిటీలో 38 పనులు 7 ప్యాకేజీల్లో పూర్తి చేయడానికి జీహెచ్‌ఎంసీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 8 స్టీల్ బ్రిడ్జ్‌లు, 6 అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల

త్వరలోనే పనులు అన్ని ప్రారంభం..

వీటిని మొదట రూ.826 కోట్లతో నిర్మించాలని ప్లాన్ చేశారు. కానీ ఫ్లైఓవర్లు స్టీల్‌తో నిర్మించడంతో అంచనా వ్యయం రూ.1090 కోట్లకు పెరిగింది. అధికారులు ఇప్పటికే ఈ పనులు పూర్తి చేశారు. ఇంకో పది రోజుల్లో అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తారు. ఆ తర్వాత వెంటనే అన్ని పనులు స్టార్ట్ చేయనున్నారు. 

ఇది కూడా చూడండి: ఈ రాత్రికి చంచల్‌గూడ జైల్లోనే అల్లు అర్జున్..!

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ మొత్తం 6 జంక్షన్లలో ఆరు అండర్ పాస్‌లు, 8 ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. కేబీఆర్ పార్క్, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. వీటి దగ్గర రెండు చొప్పున స్టీల్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. రోడ్ నెంబర్45, ఫిలింనగర్, మహారాజ్​అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లలో ఒక్కో స్టీల్ బ్రిడ్జ్‌లు రానున్నాయి.

ఇది కూడా చూడండి: Kavya Kalyanram: ఆహా.. పిచ్చెక్కించే ‘బలగం’ బ్యూటీ అందాలు..

అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రోడ్డు నెంబర్ 45 వైపు వచ్చే ఫ్లైఓవర్ ఒకటి, కేబీఆర్ పార్క్ నుంచి రోడ్ 36 వైపు ఓ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అలాగే రోడ్లను కూడా మరో 20 అడుగులు పెంచనున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. 

 ఇది కూడా చూడండి: Ap : మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు