అల్లు అర్జున్ విషయంలో పోలీసులు కఠినంగా ఉంటున్నారు. గతంలో జరిగిన తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసకుంటున్నారు.
మీరు రాకండి..
ఇందులో భాగంగా అల్లు అర్జున్‌కు రాంగోలపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. కిమ్స్ ఆసపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూడ్డానికి రావొద్దని సూచించారు. ఒకవేళ వచ్చినా తమ సూచనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. అలా కాకుండా శ్రీతేజ్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఏదైనా జరిఇతే అల్లు అర్జునే బాధ్యత వహించాల్సి వస్తుందని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
మరోవైపు బన్నీ ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళనున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో భాగంగా ఆయన ప్రతీ ఆదివారం పీఎస్ ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. దానిలో భాగంగానే అల్లు అర్జున్ ఈరోజు చిక్కడపల్లి స్టేషన్‌కు వెళ్ళి సంతకం చేయనున్నారు.
Also Read: కొత్త వైరస్‌పై అప్డేట్స్ కావాలి..డబ్ల్యూహెచ్‌వోకు ఆరోగ్యశాఖ విజ్ఞప్తి
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి రీసెంట్‌గా మళ్లీ విషమంగా మారింది. మధ్యలో పిల్లాడు కోలుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆక్సిజన్ తీసేశామని.. సొంతంగా శ్వాస తీసుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. కానీ మళ్ళీ శ్రీతేజ్‌కు ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ అవసరం అయ్యిందని నాలుగు రోజుల క్రితం డాక్టర్లు చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడినట్లు వెల్లడిస్తున్నారు. నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా ఫీడింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. న్యూరో సిస్టమ్‌లో ఎలాంటి స్పందన లేదని చెప్పారు. డిసెంబర్ 4న పుష్ప మూవీ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో శ్రీతేజ్ అపస్మారక స్థితిలో చేరుకున్నాడు.
Also Read: Delhi: ఢిల్లీని కప్పేసిన పొగమంచు...ఆరు విమానాలు క్యాన్సిల్, 100 లేట్