/rtv/media/media_files/2025/02/12/KHutLrW2pQexbIX4BIib.jpg)
ind vs eng 3odi
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ మూడో వన్డే జరగనుంది. ఇండియా తుది జట్టులోకి రాహుల్, హర్షిత్ స్థానాల్లో పంత్, అర్ష్‌దీప్ వచ్చే అవకాశముంది. ఈ పిచ్ పరిస్థితులు బ్యాటింగ్‌కు కఠినంగా, బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయని, డ్యూ కూడా వచ్చే ఛాన్సుందని విశ్లేషకులు చెబుతున్నారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిచ టీమిండియా ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది.
అహ్మదాబాద్ వన్డే మ్యాచ్ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశ్యంతో భారత జట్టు నేడు మైదానంలోకి దిగనుంది. చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ టీమ్ భావిస్తోంది. ఇక స్టార్ బ్యాట్స్‌మన్ కోహ్లీ ఈ మ్యాచ్ లో మరో 89 పరుగులు చేస్తే వన్డే క్రికెట్‌లో 14000 పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా నిలుస్తాడు. గాయం కారణంగా మొదటి వన్డేకు దూరమైన కోహ్లీ.. రెండో వన్డేలో తక్కువ పరుగులు చేసి నిరాశపరిచాడు.
— BCCI (@BCCI) February 10, 2025
రెండు జట్ల అంచనా..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, ఫిలిప్ సాల్ట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), టామ్ బాంటన్, బ్రైడాన్ కార్స్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్ , మార్క్ వుడ్.
Also Read ; Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే.. స్టార్ బౌలర్లు ఔట్!