Liquor Door Delivery: ఏపీలో వైన్ డోర్ డెలివరీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు

ఏపీలో మద్యం డోర్ డెలివరీ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు ఏజెన్సీ ప్రాంతంలో చిన్న వ్యాన్‌లో మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Wine door delivery

Wine door delivery Photograph: (Wine door delivery)

Liquor Door Delivery: ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల బీర్(Beer) ధరలను కూడా ప్రభుత్వం పెంచింది. అయితే తాజాగా ఏపీలో లిక్కర్ డోర్ డెలివరీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏలూరు ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు ఇంటింటికి వెళ్లి మద్యం డెలివరీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చూడండి: Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

ఇది కూడా చూడండి: Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!

ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు..

కుక్కునూరు మండలం బయ్యనగూడానికి చెందిన వ్యక్తి ఏలూరు జిల్లాలో మద్యం హోం డెలివరీ చేస్తున్నాడు. జంగారెడ్డిగూడెం నుంచి మద్యం సీసాలు తీసుకొచ్చి గ్రామాల్లో వీటిని అమ్ముతున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యం డెలివరీ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిదే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు