/rtv/media/media_files/2025/01/22/Rd8jyb9DZfFGPfQhoOHJ.jpg)
CM Chandra Babu
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World EConomic Forum) లో రెండో రోజు గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ నిర్వహించిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఏపీని ఆదర్శంగా, నంబర్ వన్ గా నిలపాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చేదిద్దే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. 1999లో మొదటిసారి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం. వాటి ఫలాల్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీన్ని మరింత అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు చెప్పారు. పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను వేగవంతం చేయడానికి 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఎన్‌టీపీసీ, ఏపీ జెన్‌కో భాగస్వామ్యంతో పూడిమడక దగ్గర ఏర్పాటు చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఈమధ్యనే శంకుస్థాపన కూడా చేశారని వివరించారు. దీంతో రాష్ట్రంలో బయో ఫ్యూయెల్ ఫ్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి రిలయెన్స్ స్స్థ రూ.65 వేలకోట్లు పెట్టుబడి పెడుతోందని చెప్పారు.
దేశజనాభానే దేశాభివృద్ధి...
ఇండియాలో జనాభా ఎక్కువ అని అంధరూ అంటారు. ఇది దేశాభివృద్ధిని ఆపుతోందని భావిస్తారు. కానీ భారతదేశానికి జనాభానే ఫ్లస్ పాయింటని చెప్పారు సీఎం చంద్రబాబు. 2027 నాటికి దేశ జీడీపీ వృద్ధిరేటు భారీగా పెరుగుతుందని బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది. 2028 నుంచి భారత శకం ప్రారంభమవుతుందని చంద్రబాబు భవిష్యత్తు చెప్పారు. దీనికి ప్రధాని మోదీ చాలా కష్టపడుతున్నారని...వికసిత్ భారత్ 2047తో దేశాన్ని సూపర్ పవర్ గా తీర్చుదిద్దుతారని చెప్పారు. సంపద సంపద సృష్టిలో భారతీయులు ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదుగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: Cricket: నేటి నుంచే ఇంగ్లాండ్- భారత్ టీ 20 సిరీస్
Also Read : గుబులు గుబులుగా భారతీయులు..తిరుగుటపా తప్పదేమో..