హనీ రోజ్ కేసులో బిగ్ ట్విస్ట్..  ఆ ఇద్దరు అధికారులు సస్పెండ్

హనీ రోజ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆరోపణలు ఎదురుకుంటున్న బాబీ చెమ్మనూర్‌కు కాక్కనాడ్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు  వీఐపీ ట్రీట్‌మెంట్ అందించారనే ఆరోపణలపై ఇద్దరు సీనియర్ జైలు అధికారులను కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 

New Update
 Boby Chemmanur

Boby Chemmanur Photograph: ( Boby Chemmanur )

మలయాళ నటి హనీ రోజ్ ని వేధించిన కేసులో ప్రముఖ బిజినెస్‌మెన్ బాబీ చెమ్మనూర్‌ అరెస్టైన సంగతి తెలిసిందే.  బాబీ చెమ్మన్నూర్‌కు కేరళ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బెయిల్ పై రిలీజ్ అయ్యారు. అయితే ఇప్పుడీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. బాబీ చెమ్మనూర్‌కు కాక్కనాడ్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు  వీఐపీ ట్రీట్‌మెంట్ అందించారనే ఆరోపణలపై ఇద్దరు సీనియర్ జైలు అధికారులను కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 

జైలు హెడ్ క్వార్టర్స్ డీఐజీ సమర్పించిన విచారణ నివేదిక మేరకు సెంట్రల్ రీజియన్ జైలు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి అజయకుమార్, ఎర్నాకుళం జిల్లా జైలు సూపరింటెండెంట్ రాజు అబ్రహంలను సస్పెండ్ చేసింది. వీరిపై ఉన్నాతాధికారులు విచారణ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేరళ హోం శాఖ ఆదేశించింది.  ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ముగ్గురు వీఐపీలు చెమ్మనూర్‌ ను ఎలాంటి అనుమతులు లేకుండా జైల్లో కలిశారు.  

చెమ్మనూర్ రిమాండ్‌లో ఉన్న సమయంలో  ముగ్గురు వీఐపీలు జైలుకు వచ్చారని, సూపరింటెండెంట్ గదిలో వారు  బాబీ చెమ్మనూర్‌ ను కలిసే అవకాశం కల్పించారని జైలు చీఫ్ గుర్తించారు. దాదాపు గంటపాటు వారు మాట్లాడుకున్నట్లుగా విచారణలో తేలింది.  జైలు నిబంధనలను ఉల్లంఘించడంతో ఈ చర్య తీసుకున్నారు. 

నటి హనీ రోజ్ ఫిర్యాదు మేరకు చెమ్మన్నూర్‌ను ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు వాయనాడ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఎర్నాకుళం ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే తనపై నాన్‌ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో బాబీ చెమ్మనూర్‌ బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ ను మంజూరు చేసింది. 

వీరసింహారెడ్డి చిత్రంతో కంబ్యాక్ 

ఇక 2008లో ఆలయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది  హనీ రోజ్.  ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది.  ఆ తరువాత తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చి మలయాళంలోనే సినిమాలు చేసుకుంది.  2023 లో వచ్చిన బాలయ్య వీరసింహారెడ్డి చిత్రంతో కంబ్యాక్ ఇచ్చింది.  దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడు పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రాచెల్‌ అనే ప్రాజెక్ట్‌ ఉంది. ఇందులో హనీ ఊరమాస్‌ లుక్‌లో కనిపించనుంది.

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు