/rtv/media/media_files/2025/08/12/road-accident-2025-08-12-15-41-36.jpg)
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం(America Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్(Hyderabad) కు చెందిన విద్యార్థిని మృతి చెందింది. సిద్దిపేట జిల్లా రామారుకల గ్రామానికి చెందిన శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులకు శ్రీజా వర్మ, శ్రేయా వర్మ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే బతుకుదెరువు కోసమని శ్రీనివాస్ వర్మ దంపతులు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చారు. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని శ్రీకృష్ణానగర్‌లో నివాసముంటున్నారు. శ్రీనివాస్ వర్మ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. ఆయన భార్య ఓ ప్రైవేటు సంస్థలో జాబ్ చేస్తుంది. అయితే వీరి పెద్ద కుమార్తె శ్రీజా వర్మ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. అక్కడ ఎంఎస్ కూడా ఇటీవలే పూర్తి చేసింది.
అమెరికాలో వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టడంతో తెలంగాణ యువతి మృతి
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2025
అమెరికాలోని చికాగోకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్‌కు చెందిన శ్రీను రావు పెద్ద కుమార్తె శ్రీజ వర్మ (23) అనే యువతి
అయితే రెస్టారెంట్‌కు డిన్నర్ కోసం నడుచుకుంటూ వెళుతుండగా వెనక నుండి ట్రక్కు… pic.twitter.com/7noHHLNGAn
Also Read : ఖజానా జ్యువెలర్స్‌లో భారీ దోపిడీ.. రూ.కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్లిన దుండగులు
భోజనం కోసమని బయటకు వచ్చి
భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి తాను ఉంటున్న అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వచ్చి భోజనం చేసేందుకు కారులో రెస్టరెంట్‌కు వెళ్లింది. భోజనం చేశాక తిరిగి అపార్ట్‌మెంట్ కు వెళ్తుండగా.. ఆమె వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజా వర్మ తీవ్రంగా గాయపడి అక్కడిక్కడడే మృతిచెందింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో శ్రీజా వర్మతో పాటు ఆమె స్నేహితురాలు, మరో వ్యక్తి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీనివాస్ వర్మ చిన్న కుమార్తె శ్రేయా వర్మ సైతం ఎంఎస్ చేసేందుకు 20 రోజుల క్రితం అమెరికా వెళ్లడం గమనార్హం. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో హైదరాబాద్‌లోని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
హైదరాబాద్ కుటుంబం మృతి:
అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఒక కుటుంబం మరణించింది. ఈ ప్రమాదం 2025 జులై 7న జరిగింది. అట్లాంటాలో బంధువుల ఇంటి నుంచి డల్లాస్‌కు తిరిగి వస్తుండగా, గ్రీన్ కౌంటీ వద్ద వారి కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారుకు మంటలు అంటుకోవడంతో శ్రీవెంకట్ బెజుగం, తేజస్విని దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు సిద్ధార్థ్ , మ్రిదా సజీవ దహనమయ్యారు. ఈ కుటుంబం మూడేళ్ల క్రితం హైదరాబాద్ లోని కొంపల్లి నుంచి అమెరికా వెళ్లి డల్లాస్ లో స్థిరపడింది. ఈ ఘటన సంచలనంగా మారింది.
Also Read : హైదరాబాద్‌లో గ్యాంగ్‌వార్.. పొట్టుపొట్టు కొట్టుకున్న కాలేజీ స్టూడెంట్స్