Hyderabad: ఖజానా జ్యువెలర్స్‌లో భారీ దోపిడీ.. రూ.కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్లిన దుండగులు

హైదరాబాద్‌లోని చందానగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఖజానా జ్యువెలర్స్‌లో తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. కోట్లాది రూపాయల విలువైన నగలు ఎత్తుకెళ్లారు. అలాగే స్టోర్‌ డిప్యూటీ మేనేజర్‌పై కూడా కాల్పులు జరిపారు.

New Update

హైదరాబాద్‌లోని చందానగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఖజానా జ్యువెలర్స్‌లో తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. కోట్లాది రూపాయల విలువైన నగలు ఎత్తుకెళ్లారు. అలాగే స్టోర్‌ డిప్యూటీ మేనేజర్‌పై కూడా కాల్పులు జరిపారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్‌లో దొంగతన చేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దోపిడి దొంగలను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు.   

Also Read: అమెరికాలో అల్లకల్లోలం.. రాజధానిలో భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్.. అసలేం జరుగుతోంది?

ఇదిలాఉండగా ఇటీవల కాచిగూడలోని  పారిశ్రామికవేత్త ఇంట్లో కూడా భారీ దోపిడి జరిగింది. వాళ్లింటి పనివాళ్లు వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చారు. ఆ తర్వాత 2 కిలోల బంగారు నగరు, రూ.3 కోట్ల నగదు అపహరించారు. అలాగే సరూర్‌నగర్‌లో కూడా ఓ ఇంట్లో వృద్ధురాలిని బంధించారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, గాజులు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.

Also Read: పగులుతున్న తలలు.. భారీగా దొంగ ఓట్లు.. పులివెందుల, ఒంటిమిట్టలో దారుణాలు!

Advertisment
తాజా కథనాలు