ఎవరా బిజినెస్మెన్ : IPL ఫిక్సింగ్ ఆరోపణలు..రంగంలోకి హైదరాబాద్ పోలీసులు!

ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం హాట్ టాపిక్ గా మారింది.  హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లుగా బీసీసీఐ గుర్తించింది. దీనిపై పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆ వ్యాపారవేత్త ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారు.

New Update
Hyderabad-police match fixing

Hyderabad-police match fixing

ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లుగా బీసీసీఐ గుర్తించింది. ఐదు హాట్ ఫేవరేట్ టీమ్ ఫ్రాంచైజీలను అతను కాంటాక్ట్ చేసినట్లుగా బీసీసీఐ ఆధారాలు సేకరించింది.   ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కి పాల్పడే అవకాశం ఉందని ఇప్పటికే బీసీసీఐ అన్ని ఫ్రాంఛైజ్‎ల యజమాన్యాలు, ఆటగాళ్లు, జట్ల మేనేజర్లు, కోచ్‎లు, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేసింది.

Also read :  గ్రూప్-1 నియామకాలకు బ్రేక్..  TGPSCకి హైకోర్టు బిగ్ షాక్..

హైదరాబాద్ పోలీసులు అలెర్ట్

అటు దీనిపై హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఆ వ్యాపారవేత్త ఎవరనేదానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ప్రముఖంగా ఓ ఐదుగురు వ్యాపారవేత్తలపై పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారి కదలికలను నిశితంగా పరిశీలిస్తోన్న పోలీసులు.. ఏ మాత్రం అనుమానం నిజం అని అనిపించిన వారికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది. బీసీసీఐ సేకరించిన ఆధారాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులు కోరినట్లుగా తెలుస్తోంది.  

ఐపీఎల్ 18వ ఎడిషన్ సగం పూర్తి అయ్యాక మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం ఇప్పుడుక్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం ఇదేం కొత్త కాదు.  గతంలో ఫిక్సింగ్ ఆరోపణలపతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్నాయి. తాజాగా ఐపీఎల్ లో మరోసారి ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  

Also read : TN High Court : వేశ్యతో పోలుస్తూ హిందువులపై జోక్..  తమిళనాడు మంత్రిపై కేసు నమోదు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు