/rtv/media/media_files/34LTFv5TLXSUxWWgqK7i.jpg)
గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్సీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దన్న న్యాయస్థానం సర్టిఫికెట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. గ్రూప్-1లో అవకతవకలు జరిగాయని హైకోర్టులో 20 పిటిషన్లు దాఖలు అయ్యాయి. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్-1 నియామక పత్రాలు ఇవ్వొద్దంది హైకోర్టు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు
కాగా గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను ఇప్పటికే టీజీపీఎస్‌సీ ప్రకటించింది. గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను 2025 ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.